వేణుస్వామి ఉగాది పంచాంగం.. ఈ ఏడాది వీళ్లకు పదవీగండం..

"రాజులకు ప్రాణగండం ఉంది. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని, వివిధ దేశాల్లో అధ్యక్షులు" అని వేణుస్వామి అన్నారు.

వేణుస్వామి ఉగాది పంచాంగం.. ఈ ఏడాది వీళ్లకు పదవీగండం..

Venu Swamy

Updated On : March 28, 2025 / 5:47 PM IST

ఉగాది అనగానే తెలుగు వారికి ఆ పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకు వస్తాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో జాతకం ఎలా ఉందో తెలుసుకుంటారు చాలా మంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి విశ్వావసు నామ సంవత్సరంలో ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయనే విషయంపై 10టీవీకి వివరాలు తెలిపారు.

వేణుస్వామి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..
సంవత్సరాల పేర్లకు, వాటి వల్ల వచ్చే జాతక ఫలాలకు సంబంధం ఉండదు. గత పదేళ్లలో సంచలనాన్ని నమోదు చేసిన విషయాన్ని పరిశీలిస్తే.. 2019 డిసెంబరులో వచ్చిన షష్టగ్రహ కూటమి. మకరరాశిలో ఏర్పడి కరోనా వ్యాధిని వ్యాప్తి చెందేలా చేసింది.

ఈ ఏడాది మార్చి 30న ఉగాదినాడే షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల ఏం జరగబోతుందంటే.. ఈ ఏడాది అధిపతి రవి. అంటే సూర్యుడు.. రవి ప్రపంచాన్ని శాసిస్తాడు. పేరు, ప్రఖ్యాతలు ఇస్తాడు. రాజ్యానికి, రాజకీయానికి అధిపతి. హార్ట్‌, లివర్‌, కళ్లకు, చర్మానికి, భార్యాభర్తల బంధానికి అధిపతి సూర్యుడు. ఆయన షష్టగ్రహ కూటమి శనితో కలిసి మీనరాశిలో ఉన్నాడు.

సూర్యుడు ప్రభావితం అవుతాడు. మూడు గ్రహాలు కుజుడు, గురువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలన్నీ మీనరాశిలో బంధించి ఉన్నాయి. రాజ్యాలకు సంబంధించి, దేశాలకు, రాష్ట్రాలకు సంబంధించి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది.

రాజులకు ప్రాణగండం ఉంది. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని, వివిధ దేశాల్లో అధ్యక్షులు.. వివిధ దేశాల సంప్రదాయాలను బట్టి, వారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పదవి నుంచి దిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది రాజకీయాలకు సంబంధించి చెబుతున్నాను.