Auto Expo 2025
Auto Expo 2025 : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో సన్నాహాల్లో బిజీగా ఉంది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ఢిల్లీలో జనవరి 17 నుంచి జనవరి 22, 2025 వరకు జరగనుంది. ఈ సందర్భంగా జపనీస్ ఆటో దిగ్గజం రెండు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Read Also : TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? మరో చైనా యాప్ తెగ డౌన్‌లోడ్ చేస్తున్నారట..!
సుజుకి తొలి ప్యాసింజర్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV, e Vitara), ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. రాబోయే ఈ సుజుకి ఇ స్కూటర్ కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఇ యాక్సెస్ స్కూటర్ కూడా ఈవెంట్‌లో ఆవిష్కించనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. మీడియా సమావేశంలో సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రతినిధి, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి మాట్లాడుతూ.. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ ఇ విటారా, ఇ యాక్సెస్‌ను ఆవిష్కరిస్తుంది.
అయితే, సుజుకి ఇ యాక్సెస్ ధర, టెక్నికల్ ఫీచర్లు, ఇతర ఫీచర్లకు సంబంధించిన వివరాలను కంపెనీ షేర్ చేయలేదు. సుజుకి ఇ యాక్సెస్ మొత్తం 2 హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లలో హోండా యాక్టివా ఇ, హోండా క్యూసి1లకు పోటీగా రానుంది. ఈ రెండు హోండా మోడళ్ల ధరలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో వెల్లడి కానున్నాయి. సుజుకి యాక్సెస్ 125, సుజుకి ఇ యాక్సెస్ అంతర్గత దహన ఇంజిన్ (ICE) వెర్షన్, భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.
హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125లకు పోటీదారుగా నిలిచింది. ఈ స్కూటర్ల మధ్య ధరలు వరుసగా రూ. 80,700, రూ. 91,800 (ఎక్స్-షోరూమ్), సుజుకి యాక్సెస్ 125 124సీసీ, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఎఫ్ఐ ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 8.7పీఎస్ పవర్, 10ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ సీవీటీతో వస్తుంది. హోండా యాక్సెస్ 125 కాకుండా, సుజుకి భారత మార్కెట్లో అవినెస్ (Avenis) బర్గమాన్ స్ట్రీట్ (Burgman Street) వంటి స్కూటర్లను అందిస్తోంది.
Read Also : Realme 14 Pro 5G : టైటాన్ బ్యాటరీతో రియల్‌మి 14ప్రో 5జీ సిరీస్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!