Realme 14 Pro 5G : టైటాన్ బ్యాటరీతో రియల్‌మి 14ప్రో 5జీ సిరీస్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!

Realme 14 Pro 5G : భారత మార్కెట్లో రియల్‌మి 14 ప్రో 5జీ 8జీబీ+128జీబీ మోడల్‌ ప్రారంభ ధర రూ. 24,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 26,999కు పొందవచ్చు.

Realme 14 Pro 5G : టైటాన్ బ్యాటరీతో రియల్‌మి 14ప్రో 5జీ సిరీస్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!

Realme 14 Pro Plus And Pro 5G

Updated On : January 16, 2025 / 10:11 PM IST

Realme 14 Pro 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి రియల్‌మి 14 ప్రో 5జీ, రియల్‌మి 14 ప్రో ప్లస్ 5జీ ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్వెడ్ గ్రే, కలర్ మారే పెర్ల్ వైట్ ఎండ్ ఉన్నాయి. రియల్‌మి 14 ప్రో ప్లస్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

అయితే, రియల్‌మి 14 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్ ఉంది. ఖరీదైన ప్రో ప్లస్ మోడల్‌లో 50ఎంపీ ప్రైమరీ సోనీ ఐఎమ్ఎక్స్896 సెన్సార్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. రియల్‌మి 14 ప్రో సిరీస్‌లోని రెండు హ్యాండ్‌సెట్‌లు 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ యూనిట్లను కలిగి ఉన్నాయి.

Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!

భారత్‌లో రియల్‌మి 14 ప్రో 5జీ సిరీస్ ధర :
భారత మార్కెట్లో రియల్‌మి 14 ప్రో 5జీ 8జీబీ+128జీబీ మోడల్‌ ప్రారంభ ధర రూ. 24,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 26,999కు పొందవచ్చు. జైపూర్ పింక్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే ఫినిషింగ్‌లలో లభిస్తుంది. రియల్‌మి 14 ప్రో+ 5జీ 8జీబీ+128జీబీ వెర్షన్ ధర రూ.29,999, 8జీబీ+256జీబీ ధర రూ. 31,999కు పొందవచ్చు. 12జీబీ+256జీబీ స్టోరేజ్ మోడల్ రూ.34,999కి అందుబాటులో ఉంటుంది. బికనెర్ పర్పుల్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే కలర్‌వేస్‌లో విక్రయానికి వస్తుంది. వినియోగదారులు రూ.4వేల వరకు డిస్కౌంట్లను పొందవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్‌లపై అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. రియల్‌మి 14 ప్రో సిరీస్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 23 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

రియల్‌మి 14 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్ సిమ్ (నానో) రియల్‌మి 14 ప్రో+ ఆండ్రాయిడ్ 15లో రియల్‌మి యూఐ 6.0 ఆధారంగా రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz నిట్ పీడబ్ల్యూఎమ్ 1, 6.83-అంగుళాల 1.5కె (1,272×2,800 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్ 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రియల్‌మి 14 ప్రో ప్లస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎఫ్/1.88 అపర్చర్‌తో కూడిన 50ఎంపీ 1/1.56-అంగుళాల సోనీ ఐఎమ్ఎక్స్896 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరా యూనిట్‌లో 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్896 అల్ట్రా-వైడ్ షూటర్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 6ఎక్స్ లాస్‌లెస్ జూమ్‌తో ఓఐఎస్ సపోర్టుతో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ పెరిస్కోప్ కెమెరా కూడా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

కొత్త రియల్‌మి 14 ప్రో+లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లానాస్, బెయిడూ, గలాలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ66+ఐపీ68+ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. రియల్‌మి 14 ప్రో+ 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh టైటాన్ బ్యాటరీని అందిస్తుంది. సుమారు 163.51×77.34×7.99ఎమ్ఎమ్, సుమారు 196 గ్రాముల బరువు ఉంటుంది.

రియల్‌మి 14 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ :
రియల్‌మి 14 ప్రో 5జీ కూడా రియల్‌మి 14 ప్రో ప్లస్ మోడల్‌కు సమానమైన సిమ్, సాఫ్ట్‌వేర్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. వనిల్లా మోడల్‌లో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ కోటింగ్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌తో అమర్చారు. 8జీబీ ర్యామ్‌తో పాటు 256జీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంది.

ప్రామాణిక రియల్‌మి 14 ప్రో 5జీ ఓఐఎస్‌తో ఒకే 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్‌లో 16ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి 14 ప్రో 5జీలో సెన్సార్‌లు, కనెక్టివిటీ ఆప్షన్లు దాదాపుగా రియల్‌మి 14 ప్రో ప్లస్ 5జీ మోడల్‌కు సమానంగా ఉంటాయి. హై-రెస్ సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఐపీ66+ఐపీ68+ఐపీ69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.

రియల్‌మి 14 ప్రో 5జీ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 162×74×7.5ఎమ్ఎమ్ కొలతలు, 181గ్రాముల బరువు ఉంటుంది. రియల్‌మి టెంపరేచర్ మార్పులకు ప్రతిస్పందించే రియల్‌మి 14 ప్రో+ 5జీ, రియల్‌మి 14 ప్రో 5జీ పెరల్ వైట్ వేరియంట్‌లో కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా పడిపోయినప్పుడు, ఫోన్ బ్యాక్ కవర్ పెర్ల్ వైట్ నుంచి బ్లూకు మారుతుందని పేర్కొంది.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!