Axis Bank Digital Solutions : యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ల కోసం వినూత్న డిజిటల్ సొల్యూషన్స్‌.. బెనిఫిట్స్ ఇవే..!

Axis Bank Digital Solutions : యూజర్లకు సులభంగా ఉండేలా ఆండ్రాయిడ్ టెక్నాలజీతో రూపొందించిన అడ్వాన్స్‌డ్ క్యాష్ రీసైక్లర్‌ను భారత్‌లో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించిన ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్.

Axis Bank Digital Solutions

Axis Bank Digital Solutions : భారత్‌లో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ పరిశ్రమలోనే తొలిసారిగా రెండు వినూత్నమైన డిజిటల్ సొల్యూషన్లను ఆవిష్కరించింది. ఇటీవల జరిగిన జీఎఫ్ఎఫ్ కార్యక్రమంలో కార్డురహిత విత్‌డ్రాయల్స్, డిపాజిట్లకు యూపీఐ టెక్నాలజీతో ఆండ్రాయిడ్ క్యాష్ రీసైక్లర్ ‘యూపీఐ-ఏటీఎం’ను ఆవిష్కరించింది.

అలాగే ఎన్‌పీసీఐకి చెందిన భారత్ బిల్‌పే లిమిటెడ్‌ (NBBL) భాగస్వామ్యంతో ‘భారత్ కనెక్ట్ (బీబీపీఎస్) ఫర్ బిజినెస్’ని కూడా ఆవిష్కరించింది. సప్లై చైన్‌కి సంబంధించి వివిధ దశల్లో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను నిర్వహణ, అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్‌ను క్రమబద్ధీకరణ వ్యాపారాలకు పరిష్కార మార్గంగా ఉపయోగించవచ్చు.

యూజర్లకు సులభంగా ఉండేలా ఆండ్రాయిడ్ టెక్నాలజీతో రూపొందించిన అడ్వాన్స్‌డ్ క్యాష్ రీసైక్లర్‌ను భారత్‌లో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించిన ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్. ఏదైనా యూపీఐ ఎనేబుల్డ్ అప్లికేషన్‌ను ఉపయోగించి ఇంటరాపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ డిపాజిట్ (ఐసీడీ), ఇంటరాపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌ట్రాయల్ (ఐసీసీడబ్ల్యూ) లావాదేవీలను నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్లతో పాటు అకౌంటు ఓపెన్ చేయడం, క్రెడిట్ కార్డుల జారీ, డిపాజిట్లు, రుణాలు, ఫారెక్స్, ఫాస్టాగ్ తదితర సర్వీసులు అన్నింటిని ఒకే ప్లాట్‌ఫాంపై ఆండ్రాయిడ్ క్యాష్ రీసైక్లర్ అందిస్తుంది.

మరోవైపు, బీ2బీ వ్యవస్థ కోసం భారత్ కనెక్ట్‌ను ప్రవేశపెట్టడం పరిశ్రమలోనే మొదటిసారి. బ్యాంకు భారత్ కనెక్ట్ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకుని పనిచేస్తుంది. వినియోగదారులు తమ అకౌంట్స్ పేయబుల్స్/రిసీవబుల్స్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇన్వాయిస్ ఆధారిత ఫైనాన్సింగ్ ద్వారా పార్ట్‌నర్ ఆన్‌బోర్డింగ్, ఆర్డర్లు (పీవో అండ్ ఇన్వాయిసింగ్), పేమెంట్లు, వర్కింగ్ క్యాపిటల్‌ను మరింత మెరుగ్గా నిర్వహించుకునేందుకు వ్యాపారాలకు సాయపడుతుంది.

Read Also : Brain Cancer Risk : మొబైల్ ఫోన్ల వాడకంతో బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరగదు : WHO క్లారిటీ ఇచ్చిందిగా..!

ట్రెండింగ్ వార్తలు