Bank Holidays February 2026 (Image Credit to Original Source)
మీకు ఫిబ్రవరిలో బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే ఇది మీకోసమే.. వచ్చే నెలలో మొత్తం 9 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ఫిబ్రవరి నెలకు సంబంధించిన అధికారిక బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని రాష్ట్రాల్లో వారంతపు సెలవులు, రెండో, నాల్గో శనివారాలు ఉన్నాయి. అలాగే పండుగలు, ప్రత్యేక రోజులు కూడా ఉన్నాయి.
ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే? :
ఫిబ్రవరి 2026లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల బ్రాంచులకు చాలా సెలవులు ఉన్నాయి. ఇందులో ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ తేదీలలో బ్యాంకులు మూతపడతాయి.
రాష్ట్రాలవారీగా పండుగల రోజున బ్యాంకు సెలవులు :
వచ్చే ఫిబ్రవరి నెల 15న మహాశివరాత్రి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ బ్యాంకు హాలిడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. అదనంగా, స్థానిక పండుగలు, ప్రత్యేక సందర్భాలలో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు కూడా మూతపడతాయి.
ఫిబ్రవరి 18: సిక్కింలోని లోసర్
ఫిబ్రవరి 19: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
ఫిబ్రవరి 20 : అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఏయే బ్యాంకు సర్వీసులు పొందొచ్చంటే? :
ఈ బ్యాంకు సెలవు రోజుల్లో చెక్ క్లియరెన్స్, డ్రాఫ్ట్‌లు, లాకర్ సంబంధిత పనులు, బ్రాంచ్ కౌంటర్ లావాదేవీలు చేయలేరు. ముఖ్యంగా మహాశివరాత్రి, స్థానిక పండగ సెలవుల సమయంలో ఫిబ్రవరి రెండో వారానికి ముందే ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవడం బెటర్. మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం రోజున వస్తుంది. ఈ రోజున బ్యాంకులు సాధారణంగా సెలవు ఉంటుంది.