×
Ad

Bank Holidays October : అక్టోబర్‌లో మీకు బ్యాంకులో పని ఉందా? ఈ నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

Bank Holidays October : అక్టోబర్ 2025లో బ్యాంకులు దాదాపు నెల మొత్తం సెలవులే ఉన్నాయి.. 21 రోజుల్లో పండుగలు, వారాంతపు సెలవులు ఉన్నాయి.

Bank Holidays October

Bank Holidays October : 2025 అక్టోబర్‌ వచ్చేస్తోంది. వచ్చే నెలలో బ్యాంకులో ఏదైనా పని పెట్టుకున్నారా? అయితే, ఇది మీకోసమే.. అక్టోబర్ నెలలో మొత్తం 21 రోజులు బ్యాంకులు పనిచేయవు. పండుగలు, జాతీయ సెలవుల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు దాదాపు అక్టోబర్ నెల మొత్తం సెలవులే ఉంటాయి.

ఈ నెలలో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలలో (Bank Holidays October) గాంధీ జయంతి, దసరా, దీపావళి, ఛత్ పూజ, భాయ్ దూజ్ వంటివి ఉన్నాయి. ఈ ప్రత్యేక పండగ రోజుల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. అందుకే కస్టమర్లు తమ బ్యాంకు ఏయే రోజుల్లో పనిచేస్తుందో తెలుసుకుని ముందుగా ప్లానింగ్ చేసుకోవడం ఎంతైనా ఉత్తమం.

2025 ఏడాదిలో అక్టోబర్ 1న పండగ సీజన్ ప్రారంభమవుతుంది. అనేక రాష్ట్రాల్లో నవరాత్రి మహా నవమి రోజు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. అలాగే, అక్టోబర్ 7న మహర్షి వాల్మీకి జయంతి, అక్టోబర్ 17న కర్వా చౌత్ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు దినాలు ఉంటాయి.

Read Also : Best Upcoming Phones : గెట్ రెడీ.. అక్టోబర్‌లో లాంచ్ అయ్యే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. వన్‌ప్లస్ 15 నుంచి ఐక్యూ 15 వరకు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!

అదేవిధంగా, అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 23 వరకు నరక చతుర్దశి, లక్ష్మీ పూజ, భాయ్ దూజ్ వంటి అనేక దీపావళి సంబంధిత రోజులు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా, ఛత్ పూజ కారణంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక ఉత్తర భారత రాష్ట్రాల్లో అక్టోబర్ 27, అక్టోబర్ 28 తేదీల్లో బ్యాంకులు మూతపడతాయి. పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో దీపావళి, కాళీ పూజలకు అదనపు సెలవులు ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా, బీహార్, జార్ఖండ్, ఒడిశా, కర్ణాటక, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలైన రాష్ట్రాల్లో నవరాత్రి, దసరాకు బ్యాంకులకు ప్రత్యేక సెలవులు ఉన్నాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కర్వా చౌత్ వరకు బ్యాంకులు పనిచేయవు.

అక్టోబర్ 2025లో బ్యాంకు సెలవుల తేదీలు రాష్ట్రాల వారీగా ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..

అక్టోబర్ 1 : మహా నవమి (బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ )

అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (దేశవ్యాప్తంగా సెలవులు)

అక్టోబర్ 7 : మహర్షి వాల్మీకి జయంతి (ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్)

అక్టోబర్ 17 : కర్వా చౌత్ (పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ)

అక్టోబర్ 20 నుంచి 23 వరకు : దీపావళి, నరక చతుర్దశి, లక్ష్మీ పూజ, భాయ్ దూజ్ (రాష్ట్రాల వారీగా)

అక్టోబర్ 27 నుంచి 28 : ఛత్ పూజ (బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో)

అక్టోబర్ 31 : కాళీ పూజ (పశ్చిమ బెంగాల్), సర్దార్ పటేల్ జయంతి (గుజరాత్), దీపావళి (ఢిల్లీ)

రెగ్యులర్ వీకెండ్ సెలవులు :

పండుగ సెలవులు కాకుండా, అన్ని బ్యాంకులు ఈ కింది రోజుల్లో పనిచేయవు.
* అక్టోబర్ 5, 12, 19, 26 (ఆదివారాలు)
* అక్టోబర్ 11, 25 (రెండో, నాల్గవ శనివారాలు)