Stock Market
Stock Markets : ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో అప్ అండ్ డౌన్స్ సయ్యాట కొనసాగుతోంది. గత 100 రోజులు ట్రేడింగ్ తీరు చూస్తే మతి పోతోంది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం సంపద ఏకంగా 60 లక్షల కోట్ల రూపాయలు హరించుకుపోయింది. ఈ నెంబర్ వినగానే మైండ్ బ్లాక్ అయ్యింది కదూ. మరెందుకే ఈ సంవత్సరం వరకు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారు అలర్ట్ గా ఉండాలంటున్నారు. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది?
ఓ రోజు లాభం.. మూడు రోజులు నష్టాలు..
స్టాక్ మార్కెట్లు 2025లో ఓ రోజు లాభం మరో మూడు రోజులు నష్టాలు అన్నట్లుగా సాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డ్స్ లోకి చేరుకున్న తర్వాత జారుడు బల్లలా మారాయి. సెప్టెంబర్ 27న బీఎస్ఈ స్టాక్స్ మార్కెట్ కేపిటలైజేషన్ వ్యాల్యూ 473.84 లక్షల కోట్లుగా కాగా 414.23 లక్షల కోట్లకు తగ్గిపోయింది.
ఇన్వెస్టర్లకు.. 2025 ఓ అలర్ట్..
నిఫ్టీ అప్పట్లో 26వేల 277 పాయింట్ల దగ్గర ఉండగా.. బుధవారం నాటికి 23వేల 213 పాయింట్లకు పతనమైంది. అలా నిఫ్టీ దాదాపు 12 శాతం పతనమైంది. సెన్సెక్స్ 85వేల 978 పాయింట్ల నుంచి 76వేల 724 పాయింట్లకు జారింది. మార్కెట్ కేపిటలైజేషన్ అంటే.. మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న మొత్తం షేర్ల విలువ పరంగా స్మాల్ క్యాష్, మిడ్ క్యాష్ కేటగిరీలైతే చెరో పదమూడున్నర శాతం నష్టపోయింది. మన ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది ఇలాంటి షేర్లలోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. అందుకే, ఇన్వెస్టర్లకు 2025 ఓ అలర్ట్ అయితే ఇస్తోంది.
ఎఫ్ పీఐల అమ్మకాలే కారణం..
మార్కెట్లలో పెట్టుబడులు ఒడిదొడుకులకు లోనవుతాయి.. తస్మాత్ జాగ్రత్త అనే సందేశమే అది. మరి మార్కెట్లలో ఇంతగా అమ్మకాల ఒత్తిడికి కారణం ఏంటంటే.. సింపుల్.. ఎఫ్ పీఐల అమ్మకాలే. విదేశీ కంపెనీలు మన దగ్గర కొన్న షేర్లను విక్రయిస్తూ ఉండటమే. ఇలా గత 100 రోజుల్లోనే లక్ష 85వేల కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. అక్టోబర్ నుంచి జనవరి 12 మధ్యలో ఎఫ్ పీఐలు షేర్లు విక్రయించగా.. మరోవైపు రూపాయి మారకపు విలువ పతనం, క్రూడాయిల్ రేట్లు పెరగటం కూడా మన మార్కెట్లకు శాపంగా మారింది.
పూర్తి వివరాలు..
Also Read : బాబోయ్.. అలా తాగేశారేంటి..! సంక్రాంతికి ఏపీలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు..