AP Liquor Sales : సంక్రాంతికి ఏపీలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు..

సాధారణ రోజుల్లో రోజుకు 80 కోట్ల రూపాయల సేల్స్ జరగ్గా.. పండుగ రోజుల్లో దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి.

AP Liquor Sales : సంక్రాంతికి ఏపీలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు..

Ap Liquor Shops (Photo Credit : Google)

Updated On : January 18, 2025 / 1:57 AM IST

AP Liquor Sales : ఏపీలో సంక్రాంతి సందర్భంగా మందుబాబులు బీభత్సంగా మద్యం తాగేశారు. గతంలో ఏ సంక్రాంతికి లేని విధంగా రికార్డ్ స్థాయిలో 400 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు నమోదయ్యాయి. 3 రోజుల్లో 400 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో రూ.150 కోట్ల చొప్పున అమ్మకాలు జరిగాయి.

2లక్షల 29వేల కేసుల బీర్లు తాగేశారు..
సాధారణ రోజుల్లో రోజుకు 80 కోట్ల రూపాయల సేల్స్ జరగ్గా.. పండుగ రోజుల్లో దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి. ఈ నెల 10 నుంచి 15 వరకు దాదాపు 7లక్షల లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. ఇక, బీర్ విషయానికి వస్తే సంక్రాంతి సందర్భంగా 2లక్షల 29వేల కేసుల బీర్ ను మందుబాబులు తాగారు. గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ రేంజ్ లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

Also Read : వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు.. చాలా శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది?

3 రోజులు… రూ.400 కోట్లు..
ఏపీలో కొత్త మద్యం విధానం అమలైన తర్వాత న్యూఇయర్ కి, సంక్రాంతికి ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. సంక్రాంతి పండక్కి 3 రోజుల్లోనే దాదాపు 400 కోట్ల రూపాయల ఆదాయం సమకూరడం రికార్డ్. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిన పరిస్థితి లేదు.

Liquor Sales

భారీగా ఆదాయం..
కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చాక తమ పర్సెంటేజీ తగ్గిందని షాపులు దక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. న్యూఇయర్ సమయంలో పెద్ద ఎత్తున లిక్కర్ సేల్ జరిగింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా లిక్కర్ సేల్స్ పెద్ద ఎత్తున జరగడంతో అటు మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు, ఇటు ప్రభుత్వం కూడా భారీగా ఆదాయం సమకూరటంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటు ధరలో అన్ని రకాల బ్రాండ్లు..
ఏపీలో ప్రస్తుతం మద్యం అమ్మకాల్లో ఏ విధమైన ఆంక్షలు లేని పరిస్థితి ఉంది. అన్ని రకాల బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విధంగానే.. ఇవాళ అన్ని రకాల బ్రాండ్స్ ను మందుబాబుల కోసం అందుబాటులో ఉంచింది.

బయటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం కానీ, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రానికి మద్యం తీసుకొచ్చే పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా లేవు. ఇప్పుడు అన్ని రకాల బ్రాండ్లు ఏపీలోనే అందుబాటులో ఉండటంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న పరిస్థితి ఉంది.

 

Also Read : నవ్యాంధ్రలో కూటమి ఫ్యూచర్‌కు తిరుగులేదా? బాబు, పవన్‌ మాటల్లో లాంగ్‌ టర్మ్ వ్యూహం ఉందా?