రూ.10వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే

వారానికో లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్లు వచ్చి మురిపిస్తున్నా.. సామాన్యుడి చూపు ఎప్పుడూ బడ్జెట్(రూ.10వేల లోపు)వైపే ఉంటుంది. సాధారణ యూజర్ కి కావాల్సింది ఏముంటుంది. చక్కటి కెమెరా పనితనం ఉంటే చాలు దానికే మొగ్గు చూపుతారు. మీ కోసం రూ.పది వేల లోపు బడ్జెట్ లోని కెమెరా ఫోన్ల వివరాలు అందిస్తున్నాం. 

 

(1) XIAOMI REDMI 5 (జియోమీ రెడ్ మీ5):
20 ఫిబ్రవరి 2017న లాంచ్ చేసినప్పటికీ రూ.10వేల లోపు ఫోన్లలో ఇప్పటికీ టాప్ పొజిషన్ లో ఉంది. 5.7ఇంచుల డిస్‌ప్లేతో 720 X 1440 పిక్సెల్స్ రిసొల్యూషన్‌ను అందించగలదు. బ్యాక్ కెమెరా 12మెగా పిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5మెగా పిక్సెల్. ప్రోసెసర్ విషయానికొస్తే 1.8జిగా హెడ్జ్ ఆక్టా కోర్ క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 450తో పాటు 2జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. మార్కెట్లో రూ.8100 నుంచి రూ.8999ధరకే అందుబాటులో ఉంది. 

 

 

(2) MOTO G5 PLUS (మోటో జీ5 ప్లస్):
09 మే 2017న లాంచ్ చేసిన టాప్ 2లో ఉంది. 5.2ఇంచుల డిస్‌ప్లేతో 1080 X 1920 పిక్సెల్స్ రిసొల్యూషన్‌ను అందించగలదు. బ్యాక్ కెమెరా 12మెగా పిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5మెగా పిక్సెల్. ప్రోసెసర్ విషయానికొస్తే 2జిగా హెడ్జ్ ఆక్టా కోర్ క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 625తో పాటు 3జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. మార్కెట్లో రూ.9000 ధరకే అందుబాటులో ఉంది. 

 

 

(3) XIAOMI REDMI NOTE 5 (జియోమీ రెడ్‌మీ నోట్5):
22 ఫిబ్రవరి 2018న లాంచ్ అయిన ఈ ఫోన్ టాప్ 3లో ఉంది. 5.99ఇంచుల డిస్‌ప్లేతో 1080 X 2160 రిసొల్యూషన్‌ను అందించగలదు. బ్యాక్ కెమెరా 12మెగా పిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5మెగా పిక్సెల్. ప్రోసెసర్ విషయానికొస్తే 2జిగా హెడ్జ్ ఆక్టా కోర్ క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 625తో పాటు 4జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. మార్కెట్లో రూ.9399ధరకే అందుబాటులో ఉంది. 

 

 

(4) REALME 1 (రియల్‌మీ1):
25 మే 2018న లాంచ్ చేసిన ఇప్పటికీ ఈ ఫోన్ టాప్ 5లో కొనసాగుతుంది. 6ఇంచుల డిస్‌ప్లేతో 1080 X 2160 రిసొల్యూషన్‌ను అందించగలదు. బ్యాక్ కెమెరా 13మెగా పిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8మెగా పిక్సెల్. ప్రోసెసర్ విషయానికొస్తే 2జిగా హెడ్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ60తో పాటు 3జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. మార్కెట్లో రూ.10వేల490ధరకే అందుబాటులో ఉంది. 

 

 

(5) MOTO G5S (మోటో జీ5ఎస్):
2 ఆగష్టు 2017న లాంచ్ చేసిన ఈ ఫోన్ ఇప్పటికీ టాప్ 5లో కొనసాగుతోంది. 5.2ఇంచుల డిస్‌ప్లేతో 1080 X 1920 రిసొల్యూషన్‌తో రూపొందించారు. బ్యాక్ కెమెరా 16మెగా పిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5మెగా పిక్సెల్‌తో చక్కటి ఫొటోలు తీస్తుంది. ప్రోసెసర్ విషయానికొస్తే 1.4జిగా హెడ్జ్ ఆక్టా కోర్ క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 430తో పాటు 3జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. మార్కెట్లో రూ.8599 నుంచి రూ.9300ధరకే అందుబాటులో ఉంది.