Site icon 10TV Telugu

Best Laptops : అమెజాన్‌లో అద్భుతమైన డీల్స్.. స్టూడెంట్స్ కోసం రూ. 30వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!

Best Laptops

Best Laptops

Best Laptops : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? స్టూడెంట్స్ కోసం అద్భుమైన ల్యాప్‌టాప్స్ లభ్యమవుతున్నాయి. వీడియో కాలింగ్ లేదా అసైన్‌మెంట్ల కోసం విద్యార్థులకు (Best Laptops) ల్యాప్‌టాప్ తప్పనిసరి. కొన్నిసార్లు అధిక ధర కారణంగా ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయలేరు. ఇలాంటి పరిస్థితిలో మీ కోసం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.

ప్రత్యేకించి విద్యార్థులు అతి తక్కువ ధరకే కొత్త ల్యాప్‌టాప్ కొనుగోలు చేయొచ్చు. ఈ అమెజాన్ సేల్‌లో రూ. 30వేల లోపు ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. తక్కువ ధరలో కొత్త ల్యాప్‌టాప్స్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

HP పెవిలియన్ ల్యాప్‌టాప్ :
హెచ్‌పీ మల్టీ-ఫంక్షనల్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ టచ్‌స్క్రీన్, 360° హింజ్ వంటి ఫీచర్లతో వస్తుంది. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ ఉంది. ఇందులో మీకు 14-అంగుళాల ఫుల్ HD IPS డిస్‌ప్లే కూడా ఉంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ HP ల్యాప్‌టాప్ ధర రూ. 65,990కు పొందవచ్చు. ఇతర బ్యాంకు, ఈఎంఐ డిస్కౌంట్లతో రూ. 30వేల తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

డెల్ 15 స్మార్ట్‌చాయిస్ ల్యాప్‌టాప్ :
డెల్ 15 (స్మార్ట్‌చాయిస్) ల్యాప్‌టాప్. సన్నని, తేలికైన డిజైన్‌లో వస్తుంది. ధర కూడా మీ బడ్జెట్‌ దగ్గరగా ఉంటుంది. రోజువారీ వినియోగం కోసం ల్యాప్‌టాప్ కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3-1305U ప్రాసెసర్ కలిగి ఉంది.

Read Also : Samsung Galaxy S24 Ultra : ఇది కదా ఆఫర్ అంటే.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్‌‌పై రూ.50వేలకు పైగా డిస్కౌంట్.. ఇలాంటి ఈ డీల్ మళ్లీ రాదంతే..!

వెబ్ బ్రౌజింగ్, MS ఆఫీస్, వీడియో స్ట్రీమింగ్ వంటి స్టాండర్డ్ కంప్యూటింగ్ టాస్కులకు బెస్ట్. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల FHD IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌లో లభిస్తుంది. 8GB ర్యామ్, 512GB స్టోరేజ్ కలిగి ఉంది. ఈ డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 33,990కు కొనుగోలు చేయొచ్చు.

లెనోవా ఐడియాప్యాడ్ :
లెనోవా నుంచి లైట్ అండ్ పవర్‌ఫుల్ విండోస్ ల్యాప్‌టాప్. లెనోవా ఐడియాప్యాడ్ ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ప్రవేశపెట్టింది. ఈ ల్యాప్‌టాప్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-12450H ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.

హై పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అదే సమయంలో, ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల ఫుల్ HD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో వస్తుంది. విండోస్ 11, ఆఫీస్ 2024 ఫ్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ రూ. 47,390 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version