Best Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ జూలైలో రూ.10వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Best Smartphones : ఈ జూలైలో రూ.10వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ నుంచి పోకో వరకు ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి..

Best Smartphones

Best Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మార్కెట్లోకి రోజురోజుకీ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. అయితే, ఏ ఫోన్ కొంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా? ఈ జూలైలో (Best Smartphones) భారత మార్కెట్లో రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ F06 5G నుంచి పోకో M7 5G, రెడ్‌మి 14C 5G, లావా బ్లేజ్ 2 5G ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F06 5G :
శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ 6.7-అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. బ్రౌజింగ్, చాటింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటివి యాక్సస్ చేయొచ్చు. 5,000mAh యూనిట్‌తో బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7 రన్ అవుతుంది.

పోకో M7 5G :
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. అత్యంత సున్నితమైన ఫోన్‌లలో ఇదొకటి. 18W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. రూ. 10వేల లోపు ధరలో మంచి పర్ఫార్మెన్స్ అందించే ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన ఫోన్.

Read Also : Amazon Prime Day 2025 : డెల్, హెచ్‌పీ, లెనోవో, ఏసర్ ఏది కావాలి? స్టూడెంట్స్ కోసం రూ.50వేల లోపు టాప్ ల్యాప్‌టాప్ డీల్స్..!

రెడ్‌మి 14C 5G (Best Smartphones) :
రెడ్‌మి 14C 5G ఫోన్ పోకో M7 మాదిరిగా ఉంటుంది. హార్డ్‌వేర్ పరంగా అదే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.88-అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. 5,160mAh బ్యాటరీ 18W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. షావోమీ బాక్స్‌లో 33W ఛార్జర్‌ను కలిగి ఉంది. 50MP కెమెరాతో అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. షావోమీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ఇష్టపడే యూజర్లకు బెస్ట్ ఫోన్.

లావా బ్లేజ్ 2 5G :
లావా బ్లేజ్ 2 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. 18W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జర్ కూడా బాక్స్‌‌లో వస్తుంది. క్లటర్-ఫ్రీ ఇంటర్‌ఫేస్‌ను కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫోన్.