Amazon Prime Day 2025 : డెల్, హెచ్‌పీ, లెనోవో, ఏసర్ ఏది కావాలి? స్టూడెంట్స్ కోసం రూ.50వేల లోపు టాప్ ల్యాప్‌టాప్ డీల్స్..!
Amazon Prime Day 2025 : అమెజాన్‌లో ఏసర్, డెల్, హెచ్‌పీ, లెనోవా, ఎంఎస్‌ఐ వంటి కొన్ని ల్యాప్‌టాప్ మోడళ్లపై తక్కువ ధరకే డీల్స్ పొందవచ్చు.

Amazon Prime Day 2025
Amazon Prime Day 2025 : అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ మొదలైంది.. మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ప్రత్యేకించి స్టూడెంట్స్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ (Amazon Prime Day 2025) కొనుగోలుదారులకు అద్భుతమైన ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సందర్భంగా ల్యాప్‌టాప్‌లపై క్రేజీ డీల్స్ పొందవచ్చు.
అనేక పవర్‌ఫుల్ మోడళ్లు ఇప్పుడు రూ. 50వేల మార్కులోపు అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్-పిక్ డీల్స్ పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీ, ఎడ్యుకేషన్, రోజువారీ పనులకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ లిస్టులో ఏసర్, డెల్, హెచ్‌పీ, లెనోవా, ఎంఎస్‌ఐ నుంచి కొన్ని పాపులర్ మోడళ్లు ఉన్నాయి.
ఇందులో పర్సనల్ కంప్యూటింగ్‌లో లేటెస్ట్ ఫీచర్లు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా విద్యార్థుల కోసం అత్యంత ఆకర్షణీయమైన ల్యాప్‌టాప్ ఆఫర్లను అందిస్తోంది. అవేంటో ఓసారి లుక్కేయండి..
ఏసర్ ఆస్పైర్ లైట్ :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ఏసర్ ఆస్పైర్ లైట్ ల్యాప్‌టాప్ రూ.32,994 ధరకు అందుబాటులో ఉంది. అసలు ధర రూ.58,999 ఉండగా సేల్ సమయంలో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ సన్నని, తేలికైన ల్యాప్‌టాప్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3-1305U ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
8GB ర్యామ్, స్పీడ్ 512GB SSD స్టోరేజీతో వస్తుంది. స్కూల్ టాస్కులు, వెబ్ బ్రౌజింగ్, సాధారణ ఎంటర్‌టైన్మెంట్ కోసం వినియోగించుకోవచ్చు. 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే, మెటల్ బాడీ రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది.
అసూస్ వివోబుక్ 15 :
అసూస్ వివోబుక్ 15 ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i5-1235U 12వ జనరేషన్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ రూ.45,990కు లభిస్తోంది. ఈ మోడల్ విద్యార్థులకు అవసరమైన ఫీచర్లను కలిగి ఉంది. 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీని కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్ అప్లికేషన్‌లతో హై ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో రీసెర్చ్, మీడియా వినియోగానికి అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
MSI మోడరన్ 15 :
మోడ్రాన్ డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారులకు MSI మోడరన్ 15 ల్యాప్‌టాప్ అద్భుతంగా ఉంటుంది. అమెజాన్‌లో రూ.43,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-1335U ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
8GB ర్యామ్, స్పీడ్ బూట్ టైమింగ్స్ డేటా యాక్సెస్ కోసం 512GB NVMe SSDతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల ఫుల్ HD 60Hz డిస్‌ప్లే, ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ వంటి ఫీచర్లతో మరింత ఆకట్టుకునేలా ఉంది.
లెనోవా V15 :
ఈ లెనోవా V15 ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i7 12వ జనరేషన్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.45,990కు లభ్యమవుతుంది. సన్నని తేలికగా ఉండే ఈ లెనోవా డివైజ్ 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీతో వస్తుంది. ఇంటెన్సివ్ స్టడీకి అద్భుతంగా ఉంటుంది. 15.6-అంగుళాల ఫుల్ HD (1920×1080) యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
డెల్ 15 థిన్, లైట్ :
ఇంటెల్ కోర్ i5-1235U ప్రాసెసర్‌తో డెల్ 15 థిన్, లైట్ ల్యాప్‌టాప్ చౌకైన ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్ సందర్భంగా ఈ డెల్ ల్యాపీ ధర రూ. 44,990కు పొందవచ్చు. ఈ మోడల్ 16GB DDR4 ర్యామ్, 512GB SSD స్టోరేజీ కలిగి ఉంది. విద్యార్థులకు తగినంత మెమరీ, స్టోరేజీని అందిస్తుంది. 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ మరింత ఆకర్షణగా ఉన్నాయి.
అసూస్ వివోబుక్ గో 15 (OLED) :
డిస్‌ప్లే క్వాలిటీ కోరుకునే విద్యార్థులకు అసూస్ వివోబుక్ గో 15 (OLED) అద్భుతమైన ఆప్షన్. ఈ ల్యాప్‌టాప్ రూ.40,990 వద్ద అందుబాటులో ఉంది. ఎఎండీ రైజెన్ 5 7520U ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజీ ఉన్నాయి. ఇందులో 15.6-అంగుళాల ఫుల్ HD OLED డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. పవర్‌ఫుల్ కలర్స్, డెప్త్ బ్లాక్ వంటి ఆప్షన్లను కలిగి ఉంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్కులకు బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.