Best Smart AC
Best Smart AC : సమ్మర్ మొదలైంది. ఎండల తీవ్రత కూడా పెరిగింది. కొత్త ఏసీలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. చాలామంది కొత్త ఏసీ కోసం పరుగులు పెడుతున్నారు. మీరు కూడా కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్, Wi-Fi కనెక్టివిటీతో కూడిన ఏసీలు చాలానే ఉన్నాయి.
అందులో క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ Wi-Fi స్మార్ట్ ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అద్భుతమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే.. మీ ఇంట్లో విద్యుత్ ఆదా చేసేందుకు ఈ ఏసీలో టెక్నాలజీని కలిగి ఉంది. వేడిని తగ్గించి కూలింగ్ కెపాసిటీని అందిస్తోంది. పవర్‌ఫుల్ కూలింగ్, స్మార్ట్ కనెక్టివిటీతో పాటు మెరుగైన ఫిల్టరింగ్ వంటి సౌకర్యాన్ని కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
క్యారియర్ 1.5 టన్ ఏసీ కూలింగ్ పర్ఫార్మెన్స్ :
క్యారియర్ 1.5 టన్ ఏసీ 4800 వాట్ల కూలింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 111 చదరపు అడుగుల నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మధ్య తరహా గదులకు అనుకూలంగా ఉంటుంది. ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ టెక్నాలజీ 50శాతం వరకు శక్తి సామర్థ్యంతో వస్తుంది.
మీ అవసరాలకు తగినట్టుగా కూలింగ్ కెపాసిటీని మార్చుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ ప్రొడక్టు 580 CFM ఎయిర్ ఫ్లోతో వస్తుంది. 52°C అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది.
పవర్ కెపాసిటీ, ఇన్వర్టర్ టెక్నాలజీ :
ఈ ఏసీలో టాప్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం 3.9 (ISEER) రేటింగ్‌తో 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఏసీ వార్షిక ఎనర్జీ వినియోగం దాదాపు 952.68 యూనిట్లు. ఇన్వర్టర్ కంప్రెసర్‌ను కలిగి ఉంది. వేడి తీవత్రను కంట్రోల్ చేస్తుంది. పవర్ కంట్రోల్ ద్వారా దీర్ఘకాలికంగా వాడినా కూడా విద్యుత్ బిల్లులు తక్కువగానే వస్తాయి.
స్మార్ట్ ఫీచర్లు, ఎయిర్ ఫిల్ట్రేషన్ :
వాయిస్ కమాండ్ రిమోట్ కంట్రోల్, Wi-Fi కనెక్షన్‌తో ఏసీ స్మార్ట్ హోమ్ సిస్టమ్‌లతో ఇంటిగ్రేట్ అవ్వడం చాలా సులభం. స్మార్ట్ ఎనర్జీ డిస్‌ప్లేతో విద్యుత్ వినియోగంపై రియల్-టైమ్ ఫీడ్‌బ్యాక్ ఉంది. డెస్ట్, అలెర్జీ రాకుండా లేటెస్ట్ ప్యూర్ ఎయిర్ వచ్చేలా HD, PM 2.5 ఫిల్టర్‌లతో కూడిన డ్యూయల్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఆటో క్లీన్ యూనిట్ లోపల బూజు, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది.
ఏసీ క్వాలిటీ, ఇతర ఫీచర్లు :
క్యారియర్ 1.5 టన్ ఏసీ మెరుగైన క్వాలిటీ, కూలింగ్ పర్ఫార్మెన్స్ కోసం బ్లూ కలర్ కొర్రొజియన్ ప్రూఫ్ లేయర్‌తో 100 శాతం కాపర్ కండెన్సర్ కాయిల్‌తో వస్తుంది. వోల్టేజ్ ప్రొటెక్షన్ కోసం 135V, 280V మధ్య స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేషన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 4 ఫ్యాన్ స్పీడ్‌లు, స్మార్ట్ CRF అలర్ట్, ఆటో ఆన్/ఆఫ్ టైమర్, స్లీప్ మోడ్, ఆటో-రీస్టార్ట్ ఫెసిలిటీని అందిస్తుంది.
ధర, వారంటీ :
క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ Wi-Fi స్మార్ట్ ఫ్లెక్సీకూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ.35,490. ఒక ఏడాది వరకు ప్రొడక్టు వారంటీ, 5 ఏళ్ల వరకు PCB వారంటీ, 10 ఏళ్ల వరకు కంప్రెసర్ వారంటీని కలిగి ఉంది.