Vivo V50 Lite 4G : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో V50 లైట్ 4G ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

Vivo V50 Lite 4G Launch : వివో సరికొత్త 4G ఫోన్ వచ్చేసింది. 50MP మెయిన్ కెమెరా, 6,500mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ధర, స్పెషిఫికేషన్లు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo V50 Lite 4G : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో V50 లైట్ 4G ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

Vivo V50 Lite 4G

Updated On : March 18, 2025 / 11:05 PM IST

Vivo V50 Lite 4G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో V50 లైట్ 4G టర్కీలో ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,500mAh బ్యాటరీతో వస్తుంది. 8జీబీ ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో (FuntouchOS 15) స్కిన్‌తో వస్తుంది. అంతేకాదు.. 50MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. వివో V50 లైట్ 4G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అవుతుందో లేదో కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. గత ఫిబ్రవరిలోనే వివో V50 ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు లైట్ వెర్షన్ కూడా వస్తుందా? లేదా అనేది క్లారిటీ లేదు.

Read Also : Apple iPhone 16 : కొత్త ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16పై భారీగా తగ్గింపు.. ఐఫోన్ 16e కన్నా బెటర్ డీల్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

వివో V50 లైట్ 4G ధర, కలర్ ఆప్షన్లు :
టర్కీలో వివో V50 లైట్ 4G ఫోన్ ధర TRY 18,999 (సుమారు రూ. 45వేలు)గా నిర్ణయించింది. ఈ వివో ఫోన్ 8జీబీ+ 256జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంది. ప్రస్తుతం వివో టర్కీ ఇ-స్టోర్ ద్వారా దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ టైటానియం బ్లాక్, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

వివో V50 లైట్ 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో V50 లైట్ 4జీ ఫోన్ 6.77-అంగుళాల Full-HD+ (1,080×2392 పిక్సెల్స్) 2.5D pOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్, 94.2 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియో, ఎస్‌జీఎస్ ఐ-కంఫర్ట్ సర్టిఫికేషన్‌తో కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 8GB LPDDR4X, 256GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 685 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ విస్తరణకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15తో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో V50 లైట్ 4Gలో 50ఎంపీ IMX882 ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP సెన్సార్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్, IP65 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ బిల్డ్‌ను అందిస్తుంది.

Read Also : Google Pixel 9a : కెమెరా ప్రియులకు అదిరే న్యూస్.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఓసారి లుక్కేయండి..!

వివో V50 లైట్ 4G ఫోన్ 6,500mAh బ్యాటరీ, 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 4G, NFC, GPS, OTG, బ్లూటూత్ 5.0, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 163.77×76.28×7.79ఎమ్ఎమ్ సైజు, 196 గ్రాముల బరువు ఉంటుంది.