Google Pixel 9a : కెమెరా ప్రియులకు అదిరే న్యూస్.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఓసారి లుక్కేయండి..!
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9a వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ప్రత్యేకించి కెమెరా ప్రియులు ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.

Google Pixel 9a Phone
Google Pixel 9a Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత పిక్సెల్ బ్రాండ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. గూగుల్ పిక్సెల్ 9a అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్ అయ్యాయి.
ఈ ఫోన్ డిజైన్, ఫీచర్లకు సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి. రాబోయే కొత్త పిక్సెల్ 9a ఫోన్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలువనుంది. అదే డిజైన్‌తో అద్భుతమైన పర్ఫార్మెన్స్, మల్టీఫేస్ కెమెరా సెటప్ మరింత ఆకర్షణగా ఉంటుంది. పిక్సెల్ 9a ఫోన్ లీక్ అయిన స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పిక్సెల్ 9a డిస్‌ప్లే :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ OLED డిస్‌ప్లే ఉంటుంది. రిచ్ కలర్స్, డార్క్ బ్లాక్స్ అందిస్తుంది. డిస్‌ప్లే సైజు దాదాపు 6.1 అంగుళాలు ఉంటుంది. చూసేందుకు చాలా చిన్నగా సౌకర్యంగా ఉంటుంది. డిస్‌ప్లే హై రిఫ్రెష్ రేట్, స్మూత్ స్క్రోలింగ్, ఆకర్షణీయమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9a ప్రాసెసర్ :
ఈ ఫోన్‌లో టెన్సర్ G4 ప్రాసెసర్ ఉంటుంది. పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో వంటి పిక్సెల్ 9 సిరీస్ ఫోన్‌లలో వాడే అదే ప్రాసెసర్ ఇందులోనూ ఉంది. మార్కెట్లో అత్యంత పవర్‌ఫుల్ ప్రాసెసర్ కాకపోవచ్చు. కానీ ఏఐ ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. రోజువారీ అప్లికేషన్‌లలో సాధారణ పర్ఫార్మెన్స్ పొందవచ్చు. అడోబ్ లైట్‌రూమ్ వంటి అప్లికేషన్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 లేదా ఆపిల్ A18 వంటి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ల కన్నా పర్ఫార్మెన్స్ చాలా నెమ్మదిగా ఉండవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9a కెమెరా :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ సిస్టమ్ యూజర్లు మెరుగైన ఫ్లెక్సిబిలిటీతో ఆకర్షణీయమైన ఫొటోలను తీయొచ్చు. ఫోటోగ్రఫీ ప్రియులకు ఈ పిక్సెల్ 9a ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
బ్యాటరీ, ఇతర స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ లాంగ్ టైమ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఆసక్తిగల వినియోగదారులు పదేపదే రీఛార్జ్ చేయకుండా రోజంతా ఫోన్‌ను వాడొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ద్వారా పవర్ అందిస్తుంది.
ఆప్టిమైజ్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ వివిధ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi, NFC ఆప్షన్లు ఉన్నాయి.
ధర, వేరియంట్ (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ అధికారిక ధర ప్రకటించలేదు. మిడ్ రేంజ్ ఫోన్ల ఆధారంగా ధర ఉండే అవకాశం ఉంది. గత పిక్సెల్ ఎ సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే ఈ ఫోన్ వివిధ రకాల ర్యామ్, స్టోరేజ్ వెర్షన్‌లలో లాంచ్ కావచ్చు.
మీరు పిక్సెల్ 9a కోసం చూస్తుంటే.. గూగుల్ పిక్సెల్ పాత మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ అద్భుతమైన కెమెరా, ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ చాలా చౌకైనది. గూగుల్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌తో రన్ అవుతుంది. గూగుల్ పిక్సెల్ 8 అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది.