iPhone 16 Pro Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్.. అసలు మిస్ చేసుకోవద్దు!

iPhone 16 Pro Discount : విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రోపై రూ. 10,400 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ డీల్ కన్నా రూ. 400 చౌకగా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఎలా పొందాలంటే?

iPhone 16 Pro Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్.. అసలు మిస్ చేసుకోవద్దు!

iPhone 16 Pro Discount

Updated On : March 17, 2025 / 4:51 PM IST

iPhone 16 Pro Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ 16 ప్రో కొనుగోలుపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. విజయ్ సేల్స్ సందర్భంగా ఐఫోన్ 16 ప్రోపై రూ. 10,400 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం అందించే ఆఫర్ కన్నా అద్భుతమైన డీల్‌గా చెప్పవచ్చు. అమెజాన్‌లో ఈ ఐఫోన్ ధర రూ. 1,12,900 నుంచి ప్రారంభమవుతుంది. కార్డ్ డిస్కౌంట్‌లతో ఐఫోన్ ధర రూ. 1,09,900కి తగ్గుతుంది.

Read Also : Infinix Note 50 Pro Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫోన్ ధర వివరాలు లీక్..!

అయితే, విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రో రూ. 400 తగ్గింపుతో రూ. 1,09,500కి పొందవచ్చు. మీరు కొన్ని క్రెడిట్ కార్డులతో ఇంకా ఎక్కువ సేవ్ చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా రూ. 3వేల తగ్గింపు పొందవచ్చు.

వన్‌కార్డ్ యూజర్లు రూ. 4వేలు ఆదా చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు రూ. 4,500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 1,05,000 వరకు తగ్గవచ్చు. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే ఎవరికైనా అద్భుతమైన డీల్ అని చెప్పవచ్చు.

ఐఫోన్ 16 ప్రో కొనాలా? వద్దా? :
మీరు ఆపిల్ ఫోన్ల కోసం చూస్తుంటే.. ఐఫోన్ 16 ప్రో బెస్ట్ ఆప్షన్. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ప్రోలోని 6.1-అంగుళాల స్క్రీన్‌తో పోలిస్తే.. గోల్డ్ కలర్ ఆప్షన్, భారీ 6.3-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. సన్నని బెజెల్స్ ఎక్కువ స్క్రీన్ స్టోరేజీని ఇస్తాయి.

గేమింగ్, స్ట్రీమింగ్ లేదా బ్రౌజింగ్‌కు సరైనదిగా చెప్పవచ్చు. డిస్‌ప్లే 120Hz ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే ఫీచర్‌లను కలిగి ఉంటుంది. 1 నిట్ వరకు డిమ్ అవుతుంది. తక్కువ-కాంతిలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా రీడ్ చేయొచ్చు.

ఐఫోన్ 16 ప్రో రెండో జనరేషన్ 3nm ప్రాసెస్‌పై నిర్మించిన ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆపిల్ A18 ప్రో 6-కోర్ జీపీయూ ముందున్న A17 ప్రో కన్నా 20 శాతం వేగవంతమైనదని పేర్కొంది.

గేమింగ్, మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి ఫీచర్లకు పవర్‌హౌస్‌గా ఉంది. ఈ ఫోన్ వేగవంతమైన USB 3 స్పీడ్‌లు, ProRes వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా లైట్ అప్‌గ్రేడ్ కలిగి ఉంది. సరిగ్గా వాడితే ఫుల్ డే మొత్తం ఛార్జింగ్ వస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. :
ఐఫోన్ 16 ప్రో అద్భుతమైన ఫోన్. ఇందులో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో సహా రెండో జనరేషన్ క్వాడ్-పిక్సెల్ సెన్సార్ ఉంది. అంతేకాదు.. 48ఎంపీ (ProRAW), HEIF స్థానంలో అల్ట్రా-వైడ్ కెమెరాను ఆటోఫోకస్‌తో 48MPకి అప్‌గ్రేడ్ చేసింది.

టెలిఫోటో లెన్స్ 120mm ఫోకల్ లెంగ్త్‌తో 5x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రోలో కెమెరాలో 120fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ చేయొచ్చు. అద్భుతమైన ఆడియో క్వాలిటీతో ఆకర్షణీయమైన ఫుటేజ్‌ను పొందవచ్చు.

Read Also : Jio Free AirFiber : జియో యూజర్లకు పండుగే.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై ఫ్రీగా ఎయిర్‌ఫైబర్, జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్.. ఆఫర్ ఎలా పొందాలంటే?

పర్ఫార్మెన్స్ పరంగా ఆపిల్ ఐఫోన్ 16 ప్రో పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉంది. అందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. జెన్‌షిన్ ఇంపాక్ట్ వంటి డిమాండ్ కలిగిన గేమ్‌లను 60fps వద్ద హై సెట్టింగ్‌లతో ఆడొచ్చు.

చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ గేమ్ ఆడటం చాలా కష్టం. మొత్తంమీద, ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లే పర్ఫార్మెన్స్, కెమెరా సామర్థ్యాలలో అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. ప్రస్తుత డిస్కౌంట్‌లతో మీరు ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు.