Apple iPhone 16 : కొత్త ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16పై భారీగా తగ్గింపు.. ఐఫోన్ 16e కన్నా బెటర్ డీల్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిన 3 నెలల్లోనే రూ. 10వేలు ధర తగ్గింది. ఐఫోన్ 16e వెర్షన్‌తో సమానంగా ఉంటుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 sees major price cut
Apple iPhone 16 Price Cut : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. అంతేకాదు.. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి ధర ఐఫోన్ 16e మోడల్ దగ్గరగా ఉంది. ఎంట్రీ లెవల్ ఐఫోన్ 16e కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సిన పనిలేదు. ప్రీమియం ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసే కొనుగోలుదారులకు బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.
ఐఫోన్ 16 డిస్కౌంట్.. ధర రూ.67,490 :
ఐఫోన్ 16 (128GB) మోడల్ అసలు ధర రూ.79,900 ఉండగా, ఇప్పుడు క్రోమాలో రూ.71,490కి లిస్టు అయింది. అంటే.. నేరుగా రూ.8,410 డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, ICICI, SBI, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా రూ.4వేల డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ ఐఫోన్ 16 ధర రూ.67,490కి తగ్గుతుంది. పోల్చి చూస్తే.. ఐఫోన్ 16e ఫోన్ రూ.59,900కి లాంచ్ అయింది. అంతేకాదు.. రెండు మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ.7,590 మాత్రమే. ఐఫోన్ 16 అదనపు ఫీచర్లతో ఈ కొత్త ధర ఐఫోన్ 16e కన్నా మంచి అప్‌గ్రేడ్ ఫోన్ అని చెప్పవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు :
క్రోమా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 16 ధర మరింత తగ్గుతుంది. మీరు ట్రేడ్ చేసే ఫోన్ బట్టి ప్లాట్‌ఫామ్ రూ.60,766 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఉదాహరణకు.. ఐఫోన్ 13 ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.18,910 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్లు సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్‌ల కన్నా మెరుగైన ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. అయితే, ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికీ ఆఫర్ నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.
ఐఫోన్ 16e కన్నా ఐఫోన్ 16 ఎందుకు బెటర్? :
ఆపిల్ అత్యంత సరసమైన మోడల్ ఐఫోన్ 16e అయితే, ఐఫోన్ 16 అనేక ప్రీమియం ఫీచర్లతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది.
- ఆకర్షణీయమైన ఫోటోగ్రఫీకి అల్ట్రా-వైడ్ కెమెరా
- వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం MagSafe సపోర్టు
- ఫాస్ట్ Qi వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ
- కెమెరా కంట్రోల్ బటన్
- పర్ఫార్మెన్స్ కోసం అడ్వాన్స్‌డ్ GPU కోర్
- ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్ కోసం Wi-Fi 7 కనెక్టివిటీ
- అద్భుతమైన కలర్ ఆప్షన్లు
- అదనపు ఫీచర్లు, పర్ఫార్మెన్ ఆధారంగా ఐఫోన్ 16e కన్నా ఐఫోన్ 16 బెటర్
ఐఫోన్ 16eపై డిస్కౌంట్లు? :
బడ్జెట్ ఆధారంగా కొనేవారికి ఐఫోన్ 16e బెస్ట్ ఆప్షన్. కానీ, మరికొద్ది రోజులు ఆగితే ఐఫోన్ 16e ధర మరింత తగ్గవచ్చు. పండుగ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ 16e దాదాపు రూ. 40వేలకి తగ్గవచ్చు. ఐఫోన్ 16 డిస్కౌంట్లు కూడా బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఆసక్తికరంగా, ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిన 2 నుంచి 3 నెలల్లోనే రూ. 10వేల ధర తగ్గింది. ఐఫోన్ 16e వెర్షన్‌పై ఇలాంటి డిస్కౌంట్లు ఉండవచ్చు.