PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ న్యూస్.. ఈ నెల 31లోగా ఇలా చేయండి.. లేదంటే రూ. 2వేలు పడవు.. ఫుల్ డిటెయిల్స్..!

PM Kisan : పీఎం కిసాన్ రైతులు 20వ విడత రూ. 2వేలు పొందాలంటే తప్పనిసరిగా పథకంలో రిజిస్టర్ చేసుకోవాలి. కొన్ని పనులను పూర్తి చేయాలి.

PM Kisan 20th Installment

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద 20వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటివరకు, పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత విడుదల అయింది.

ఇప్పుడు రైతులు 20వ విడత (PM Kisan 20th installment) విడుదల కావాల్సి ఉంది. రైతులు పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందాలంటే ముందుగా పథకంలో చేరాలని సూచిస్తోంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో ఇలా ఇన్వెస్ట్ చేస్తే అన్ని లాభాలే.. రూ. లక్ష పెట్టుబడితో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మే 1 నుంచి మే 31, 2025 వరకు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. దేశంలోని అర్హత కలిగిన రైతులు ఈ పీఎం కిసాన్ పథక ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ క్యాంపెయిన్ ద్వారా పాత లబ్ధిదారులను చెక్ చేయడమే కాకుండా ఇప్పటికీ రిజిస్టర్ చేయని కొత్త రైతులందరూ పథకంలో చేరవచ్చు. పీఎం కిసాన్ పథకంలో చేరాలంటే ఏమి చేయాలి? అనేది పూర్తి వివరాలను వివరంగా తెలుసుకుందాం.

పీఎం కిసాన్ పథకం ఎలా పొందాలి? :

  • ఈ-కెవైసి పూర్తి చేసి ఉండాలి.
  • బ్యాంకు అకౌంటుతో ఆధార్‌ లింక్ చేసుకోవాలి.
  • భూమి రికార్డులను వెరిఫై చేయించుకోవాలి.
  • ఈ పనులన్నీ 2025 మే 31 లోపు పూర్తి చేసి ఉండాలి.

20వ విడత ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్  (PM Kisan) యోజన 20వ విడత జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి DBT ద్వారా రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ. 2వేలు వాయిదా జమ అవుతుంది.

Read Also : OnePlus 13 Price : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 10వేలు తగ్గింపుతో వన్‌ప్లస్ 13 కొనేసుకోండి..!

పీఎం కిసాన్ eKYC ఎలా చేయాలి? :

  • రైతులు తమ మొబైల్ ఫోన్లతో ఈ-కెవైసి పూర్తి చేయవచ్చు.
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి పీఎం-కిసాన్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఆధార్ నంబర్, లబ్ధిదారుడి ఐడీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయండి.