Big Relief for Borrowers
Big Relief for Borrowers : బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. కెనరా బ్యాంక్, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) వంటి ప్రధాన బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ఈ నెల (డిసెంబర్ 2025) ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే.
ఆర్బీఐ రెపో రేటును 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గించింది. కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తరువాత అనేక బ్యాంకులు తమ రెపో-లింక్డ్ లెండింగ్ రేట్లలో (RLLR) తగ్గింపును ప్రకటించాయి. చాలా మంది రుణగ్రహీతల ఈఎంఐలు దిగి వస్తాయని భావిస్తున్నారు.
కెనరా బ్యాంక్ వడ్డీ ఎంతంటే? :
కెనరా బ్యాంక్ రెపో-లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (RLLR)ను 0.25 శాతానికి తగ్గించింది. 8.25 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేటు డిసెంబర్ 12, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తగ్గింపు ఆర్బీఐ రెపో రేటు తగ్గింపులో కనిపిస్తుంది. RLLRతో లింక్ చేసిన రుణాలు కలిగిన ప్రస్తుత కస్టమర్లు త్వరలో తమ ఈఎంఐలలో తగ్గింపు పొందవచ్చు. లోన్ అగ్రిమెంట్ నిబంధనలను బట్టి రుణ వ్యవధి కూడా తగ్గుతుంది.
PNB ఎంత తగ్గించింది? :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)లో తగ్గింపును ప్రకటించింది. బ్యాంక్ రేటును 8.35శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించింది. ఇందులో 10 బేసిస్ పాయింట్ల స్ప్రెడ్ కూడా ఉంది. ఈ కొత్త రేటు డిసెంబర్ 6, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) రెపో లింక్డ్ లెండింగ్ రేట్ RLLRను 8.10 శాతానికి సవరించింది. ఈ రేటు డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో బ్యాంక్ ఒక ఏడాదిలో MCLR ఇప్పుడు 8.80శాతం, అయితే 3 ఏళ్ల MCLR 8.85శాతానికి పెంచింది. MCLR అనేది ఒక బ్యాంకు రుణం ఇచ్చే కనీస వడ్డీ రేటు..
ఎస్బీఐ రేట్లను ఎంత తగ్గించింది? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) రెండింటిలోనూ తగ్గింపును ప్రకటించింది. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 15, 2025 నుంచి అమలులోకి వస్తాయి. ఎస్బీఐ ఎల్బీఎల్ఆర్ 8.15శాతం ప్లస్ క్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP), బ్యాంక్ స్ప్రెడ్ (BSP) నుంచి 7.90శాతం ప్లస్ సీఆర్పీ బీఎస్పీకి తగ్గించింది.
బెంచ్‌మార్క్ కాంపోనెంట్‌లో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును సూచిస్తుంది. అదేవిధంగా, ఆర్బీఐ రెపో రేటుతో నేరుగా లింక్ అయిన ఎస్బీఐ ఆర్ఎల్ఎల్ఆర్ 7.75శాతం ప్లస్ CRP నుంచి 7.50శాతం ప్లస్ సీఆర్పీకి తగ్గించింది. కస్టమర్లకు ఫైనల్ వడ్డీ రేటు వారి వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. దాంతో అర్హత కలిగిన కస్టమర్లు తక్కువకే ఈఎంఐలు పొందవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు :
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకారం.. బ్యాంక్ BRLLR (బెంచ్‌మార్క్ రెపో లింక్డ్ లెండింగ్ రేటు) 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గుతుంది. రుణగ్రహీతలకు లోన్ వడ్డీ చెల్లింపులపై కొంత రిలీఫ్ అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 6, 2025 నుంచి అమలులోకి వస్తాయి.
ఇండియన్ బ్యాంక్ రెపో-లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (RLLR)ను 8.20 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేట్లు బ్యాంక్ ప్రాఫిట్ పోర్ట్‌ఫోలియోకు వర్తిస్తాయి. ఈ సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 6, 2025 నుంచి అమలులోకి వస్తాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా RBLR తగ్గింపు :
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెపో ఆధారిత రుణ రేటు (RBLR)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించింది. ఈ కొత్త మార్పు డిసెంబర్ 5, 2025 నుంచి అమలులోకి వస్తుంది. BSE వెబ్‌సైట్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసు ప్రకారం.. “డిసెంబర్ 5, 2025 నుంచి తక్షణమే అమలులోకి వచ్చేలా బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటు (RBLR)ను 8.10 శాతానికి తగ్గించినట్లు సమాచారం.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేట్లు తగ్గింపు :
ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిటైల్ రుణ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ గృహ రుణ రేట్లను 7.35శాతం నుంచి 7.10శాతానికి తగ్గించింది. తక్కువ ఈఎంఐ ఉన్న గృహ కొనుగోలుదారులకు బెనిఫిట్ పొందవచ్చు.
కారు రుణ వడ్డీ రేటును 7.70శాతం నుంచి 7.45 శాతానికి తగ్గించారు. కొత్త రుణగ్రహీతలు రుణంపై వాహనాలను కొనుగోలు చేయొచ్చు. ఈ రుణాలపై అన్ని ప్రాసెసింగ్ ఫీజులను కూడా బ్యాంక్ మాఫీ చేసింది. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న లేదా తీసుకోవాలని చూస్తున్న ఎవరికైనా బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.