Samsung Galaxy Z Fold 6 : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy Z Fold 6 : మడతబెట్టే ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Fold 6 : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెటర్ టైమ్.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ రూ.62వేల కన్నా ఎక్కువ భారీ తగ్గింపుతో అందిస్తోంది.

భారత మార్కెట్లో ఫస్ట్ రూ.1,64,999 ప్రారంభ ధరకు లాంచ్ అయిన శాంసంగ్ ఫోన్ డ్యూయల్ అమోల్డ్ డిస్‌ప్లేలు, ట్రిపుల్-కెమెరా సెటప్ ప్రీమియం డిజైన్‌తో వస్తుంది.

ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 అతి తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దం..

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ రూ.1,64,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ప్రస్తుతం రూ.1,06,990కి లిస్ట్ అయింది. రూ.58,009 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్ కొనుగోలుపై రూ.4వేలు సేవ్ చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయడం ద్వారా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 7.6-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల ఎక్స్‌ట్రనల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ అమోల్డ్ 2X ప్యానెల్‌లు కలిగి ఉంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 10MP కెమెరా కలిగి ఉంది. ఇంకా, ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh డ్యూయల్ బ్యాటరీని అందిస్తుంది.
