EPFO Subscribers
EPFO Subscribers : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఉద్యోగులకు డెత్ రిలీఫ్ ఫండ్ (EPFO Subscribers) కింద ఎక్స్-గ్రేషియా చెల్లింపును
పెంచేసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి రూ.8.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది.
ఈ మొత్తాన్ని సర్వీసులో ఉన్నప్పుడు మరణించిన ఉద్యోగుల నామినీ లేదా చట్టపరమైన వారసులకు అందుతుంది. ఈ మొత్తం స్టాఫ్ వెల్‌ఫేర్ ఫండ్ నుంచి చెల్లిస్తుంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వ్యయాల వేగానికి అనుగుణంగా ఏప్రిల్ 1, 2026 నుంచి ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని ఏటా 5 శాతం పెంచుతామని పీఎఫ్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఇదే విషయాన్ని ఈపీఎఫ్ఓ ఆగస్టు 19, 2025 నాటి సర్క్యులర్‌లో పేర్కొంది.
Read Also : Online Gaming Bill 2025 : Dream 11 సంచలన నిర్ణయం.. MPL, Zupee కూడా.. ఆ సర్వీసులన్నీ వెంటనే బంద్
2025లో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు విధానాలను సులభతరం చేసేందుకు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. మైనర్ పిల్లల బ్యాంకు అకౌంట్లలో క్లెయిమ్‌లను పరిష్కరించేటప్పుడు గార్డియన్‌షిప్ సర్టిఫికెట్ల అవసరాన్ని తొలగిస్తుంది. తద్వారా డెత్ క్లెయిమ్ ప్రక్రియను మరింత ఈజీ అవుతుంది.
అదనంగా, జాయింట్ స్టేట్‌మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించారు. ఆధార్‌ను తమ UANతో ఇంకా లింక్ చేయని లేదా వెరిఫై చేయని సభ్యులు లేదా ఆధార్ వివరాలను సరిదిద్దుకోవాల్సిన సభ్యులు ఇప్పుడు సులభంగా పూర్తి చేయవచ్చు.
జూన్ 2025 నాటికి ఈపీఎఫ్ఓ తాత్కాలిక జీతాల డేటా 2.18 మిలియన్ల నికర అధికారిక ఉద్యోగాలు అదనంగా పెరిగాయి. ఏప్రిల్ 2018లో పేరోల్ ట్రాకింగ్ నుంచి అత్యధిక నెలవారీ పెరుగుదలను సూచిస్తుంది. మే 2025లో నమోదైన 2.01 మిలియన్ ఉద్యోగాల నుంచి 8.9 శాతం పెరుగుదలగా చెప్పవచ్చు. జూన్ 2024లో 1.93 మిలియన్ ఉద్యోగాలతో పోలిస్తే.. ఏడాదికి 12.9 శాతం పెరుగుదలను సూచిస్తుంది.