Black Friday Deal
Black Friday Deal : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్లాక్ ఫ్రైడే అధికారికంగా ప్రారంభమైంది. క్రోమా ఈ సీజన్‌లో ఐఫోన్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. సాధారణంగా టీవీలు, ల్యాప్‌టాప్‌లు హోం అప్లయన్సెస్ ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో ఐఫోన్ ఎయిర్‌పైనే భారీ తగ్గింపు అందించింది.
మీరు కూడా కొత్త ఐఫోన్ కోసం (Black Friday Deal) అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. నవంబర్ 22న ప్రారంభమైన ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. వైడ్ రేంజ్ గాడ్జెట్‌లపై కిర్రాక్ డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే, ఐఫోన్ ఎయిర్ ఆఫర్ అత్యంత ఆకర్షణగా నిలుస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ బ్లాక్ ఫ్రైడే డీల్ :
ఆపిల్ కొన్ని నెలల క్రితమే సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో ఐఫోన్ ఎయిర్ లాంచ్ చేసింది. 256GB వేరియంట్ ధర రూ.1,19,900కు పొందవచ్చు. లైనప్‌లోకి కొత్తగా వచ్చినా క్రోమా బ్లాక్ ఫ్రైడే ప్రమోషన్‌లో భాగంగా ధరను రూ.1,12,900కి తగ్గించింది. ఆసక్తిగల కొనుగోలుదారులకు ఇన్‌స్టంట్ రూ.7వేలు తగ్గింపు అందించింది.
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులకు క్రోమా అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కస్టమర్‌లు 6 నెలల వరకు తక్కువ-ధర ఈఎంఐ ఆప్షన్లతో పాటు అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా, ధర రూ.11వేలు తగ్గుతుంది. ఐఫోన్ ఎయిర్‌లో లాంచ్ నుంచి బెస్ట్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల OLED ప్యానెల్ అందిస్తుంది. ప్రోమోషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ పీక్ అవుట్‌డోర్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆపిల్ ప్రత్యేక 7-లేయర్ యాంటీరిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా అందిస్తుంది. సూర్యకాంతిలో డిస్‌ప్లే అద్భుతంగా కనిపిస్తుంది. హుడ్ కింద, ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ఇదే పవర్‌ఫుల్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ మోడళ్లలో 48MP ఫ్యూజన్ బ్యాక్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 18MP సెల్ఫీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఐఫోన్ ఎయిర్ స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్ స్కై బ్లూ 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది.