×
Ad

Black Friday Sale 2025 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్‌లో 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ మీకోసం.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Black Friday Sale 2025 : అమెజాన్‌లో అద్భుతమైన డీల్స్.. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Black Friday Sale 2025

Black Friday Sale 2025 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తోంది. ఏదైనా కొత్త ల్యాప్‌టాప్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ప్రస్తుతం మార్కెట్లో అనేక (Black Friday Sale 2025) బ్రాండ్ల ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో బెస్ట్ ల్యాప్‌టాప్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.. ఇందులో మీకు నచ్చిన ల్యాప్‌టాప్ కొనేసుకోండి.

ఏసర్ ఆస్పైర్ లైట్ ఇంటెల్ కోర్ i3 13వ జనరేషన్ 1305U (రూ. 28,210) :
ఏసర్ ఆస్పైర్ లైట్ 1920×1080 రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే కలిగి ఉంది. ఇంటెల్ కోర్ i3-1305U ప్రాసెసర్‌తో విండోస్ 11 హోమ్‌పై రన్ అవుతుంది. ఇప్పుడు అమెజాన్‌లో ధర రూ. 52,990 తక్కువ ధరకు లభిస్తుంది.

​హెచ్‌పీ 15.6′ FHD రైజెన్ 3 7320U ల్యాప్‌టాప్ (రూ. 30,190) :
ఈ HP ల్యాప్‌టాప్ AMD రైజెన్ 3 7320U ప్రాసెసర్‌ కలిగి ఉంది. 1920×1080 రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల FHD డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ హెచ్‌పీ విండోస్ 11 హోమ్‌పై రన్ అవుతుంది. అధికారిక ధర రూ.41,900కు పొందవచ్చు. బ్లాక్ ఫ్రైడే సేల్‌ సమయంలో ఈ ల్యాప్‌టాప్ ధర 25 శాతానికి తగ్గింది.

Read Also : Samsung Galaxy Z Flip 7 FE : అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌ ఇంత తక్కువా? ధర ఎంతో తెలిస్తే ఎగబడి కొనేస్తారు..

​ఆసుస్ వివోబుక్ గో 14 AMD రైజెన్ 3 క్వాడ్ కోర్ 7320U (రూ. 31,890) :
ఆసుస్ వివోబుక్ 1920 x 1080 రిజల్యూషన్‌తో 14.0-అంగుళాల FHD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్ 250 నిట్స్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. AMD రైజెన్ 3 7320U మొబైల్ ప్రాసెసర్‌తో విండోస్ 11 హోమ్‌లో రన్ అవుతుంది.

​HP 255 నోట్‌బుక్ AMD అథ్లాన్ సిల్వర్ 7120U (రూ. 24,990) :
అద్భుతమైన విజువల్స్ కోసం HP 255 నోట్‌బుక్‌లో ఎఎండీ రేడియన్ 610M గ్రాఫిక్స్, 1366×768 రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల వికర్ణ HD డిస్‌ప్లే ఉన్నాయి. నారో బెజెల్స్, యాంటీ-గ్లేర్ స్క్రీన్, 250 నిట్స్ బ్రైట్‌నెస్‌ కూడా కలిగి ఉంది. ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ రూ. 30,336 ధర వద్ద ఇప్పుడు 18శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.

లెనోవా 15 AMD రైజెన్ 3 7320U క్వాడ్ కోర్ (రూ. 29,660) :
లెనోవా 15 AMD రైజెన్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.1,01,900 ఉండగా, కస్టమర్లు ఇప్పుడు 71శాతం వరకు తగ్గింపుతో అద్భుతమైన డిస్కౌంట్ పొందవచ్చు. లెనోవా 15 రైజెన్ 3 సీపీయూ కలిగి ఉంది. 1920 x 1080 రిజల్యూషన్ 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 15.6-అంగుళాల FHD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే కలిగి ఉంది.