×
Ad

Train Tickets : రైల్వే కొత్త రూల్స్.. ఇకపై ట్రైన్ కన్ఫార్మడ్ టికెట్ కూడా మరో తేదీకి మార్చుకోవచ్చు.. పైసా ఖర్చు లేకుండా.. ఎప్పటినుంచంటే?

Confirmed Train Tickets : భారత రైల్వే త్వరలో కొత్త రూల్ తీసుకొస్తోంది. ప్రయాణీకులు కన్ఫర్మ్ టిక్కెట్ల తేదీని చివరి నిమిషం వరకు మార్చుకోవచ్చు.

Confirmed Train Tickets

Confirmed Train Tickets : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రైన్ టికెట్ బుకింగ్‌పై అతి త్వరలో కొత్త రూల్స్ రానున్నాయి. ఆన్‌లైన్‌లో కన్ఫార్మ్ టికెట్లను రీషెడ్యూల్ చేసేందుకు భారతీయ రైల్వే సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. జనవరి 2026 నుంచి ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా మార్చుకోవచ్చు. క్యాన్సిలేషన్ లేదా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇప్పటివరకు, ట్రైన్ ఒకసారి టికెట్ (Confirmed Train Tickets) బుక్ చేసుకున్నాక మార్చుకోవాలంటే కుదరదు. ప్రయాణీకులు తమ కన్ఫార్మ్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకున్నాకే కొత్త టికెట్లను బుక్ చేసుకోవాలి. ఇందులో క్యాన్సిలేషన్ రుసుము కూడా ఉంటుంది. ప్రస్తుతం, ట్రైన్ బయలుదేరే ముందు 48 గంటల నుంచి 12 గంటల ముందు కన్ఫార్మ్ టిక్కెట్‌ను క్యాన్సిల్ చేస్తే ఛార్జీలో 25శాతం తగ్గింపు ఉంటుంది. బయలుదేరే సమయానికి దగ్గరగా టికెట్ క్యాన్సిల్ జరిగితే ఛార్జీ 50శాతానికి పెరుగుతుంది.

అయితే, వచ్చే ఏడాది నుంచి కొత్త తేదీన సీట్లు అందుబాటులో ఉన్నంత వరకు ప్రయాణీకులు తమ ప్రయాణ తేదీని ఆన్‌లైన్‌లో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. రీషెడ్యూల్ చేసిన తేదీన ఛార్జీ ఎక్కువగా ఉంటే.. ప్రయాణికులు ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఒకవేళా ఒకేలా లేదా తక్కువగా ఉంటే మాత్రం అదనపు రుసుము వర్తించదు.

ఉదాహరణకు.. మీకు ఆదివారం ట్రిప్ కోసం కన్ఫర్మ్ టికెట్ ఉందని అనుకోండి. కానీ, ఏదో కారణం చేత మీ ట్రిప్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. మీరు ఇప్పుడు వచ్చే నెలలో ప్రయాణించాలి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఏమి చేస్తారు? మీరు కొత్త తేదీకి కొత్త టికెట్ బుక్ చేసుకుని పాతదాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. టికెట్ క్యాన్సిల్ చేయడానికి కూడా క్యాన్సిలేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు మీరు ఈ ఇబ్బందులన్నింటి నుంచి రిలీఫ్ పొందవచ్చు.

కొత్త సౌకర్యం ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. రైల్వే ప్రయాణీకులకు ఈ కొత్త సౌకర్యం వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతుంది. ప్రయాణీకులు తమ కన్ఫార్మ్ టిక్కెట్ల తేదీని ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. అయితే, కన్ఫార్మ్ టికెట్ తేదీని మార్చడం వల్ల ఆ తర్వాతి తేదీకి టికెట్ కన్ఫార్మ్ అవుతుందా లేదా అనేది గ్యారెంటీ ఉండదని గమనించాలి. ఆ తేదీలో టికెట్ల లభ్యత ఆధారంగా ప్రయాణీకులకు కన్ఫార్మ్ టిక్కెట్లు అందుతాయి. ఇంకా, ఛార్జీలలో తేడా ఉంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Apple MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీ ఎంత? :

  • మీ దగ్గర AC ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ అయితే క్యాన్సిలేషన్ కోసం రూ. 240 + జీఎస్టీ ​​చెల్లించాలి.
  • మీ దగ్గర AC 2 టైర్/ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంటే.. క్యాన్సిలేషన్ కోసం రూ. 200 + జీఎస్టీ ​​చెల్లించాలి.
  • ప్రస్తుతం AC 3 టైర్/AC చైర్ కార్/AC 3 ఎకానమీ టిక్కెట్లకు కనీస క్యాన్సిలేషన్ ఛార్జీ రూ. 180 + జీఎస్టీ ​​చెల్లించాలి.

మీ దగ్గర స్లీపర్ క్లాస్ టికెట్ ఉంటే.. క్యాన్సిలేషన్ కోసం కనీసం రూ. 120, సెకండ్ క్లాస్ టికెట్ క్యాన్సిలేషన్ కోసం రూ. 60 క్యాన్సిలేషణ్ ఛార్జీ చెల్లించాలి. టికెట్ రద్దు ఛార్జీలు మీరు క్యాన్సిల్ చేసే సమయంపై ఆధారపడి ఉంటాయని గమనించాలి. మీ ట్రైన్ టికెట్‌ను రైలు బయల్దేరే కొన్ని నిమిషాల ముందు క్యాన్సిల్ చేస్తే ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి.

టికెట్ జర్నీ డేట్ మార్చాలంటే? :

మీరు కన్ఫర్మ్ టికెట్ లేదా RAC (రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్) టికెట్ తేదీని ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో మార్చవచ్చు.

ఆఫ్‌లైన్ రూల్స్ ఏంటి? :
రైలు బయలుదేరడానికి కనీసం 48 గంటల ముందు మీ టికెట్ రిజర్వేషన్‌ను సమర్పించి కొత్త తేదీని రిక్వెస్ట్ చేయండి. మీరు కోచ్ కేటగిరీని కూడా మార్చవచ్చు.

క్యాన్సిలేషన్ ఛార్జీలు చెల్లించాలి :
మీరు ప్రయాణించాలనుకుంటున్న తేదీకి మీ ప్రస్తుత ట్రైన్ టిక్కెట్‌ను రద్దు చేసి కొత్తది బుక్ చేసుకోవాలి. కన్ఫార్మ్ టిక్కెట్‌ను క్యాన్సిల్ చేయడం వల్ల ఆ కేటగిరీకి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి.

ఆఫ్‌లైన్‌లో టికెట్ తేదీ మార్చాలంటే? :

ట్రైన్ టికెట్ తేదీని మార్చేందుకు రైలు బయలుదేరడానికి దాదాపు 48 గంటల ముందు మీ సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను విజిట్ చేయండి. మీ ఒరిజినల్ ట్రైన్ టికెట్‌ను సమర్పించండి. మీరు జర్నీ డేట్ తెలియజేయాలి. అల్ట్రానేట్ ట్రైన్ టికెట్‌ కొనుగోలు చేయొచ్చు. ఆ రోజు ట్రైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటేనే లభిస్తుంది. ఈ ప్రక్రియ కోసం మీరు కౌంటర్ వద్ద సంబంధిత ఫారమ్‌ను నింపాలి. టికెట్ ఫొటోకాపీని సమర్పించాలి. టికెట్ తేదీకి ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ.20 నుంచి రూ.65 వరకు ఛార్జ్ విధిస్తారు.