‘‘Love JIhadh’’ : తనిష్క్ నగలు కొనేది లేదంటూ నెటిజన్స్ ఫైర్..

  • Publish Date - October 12, 2020 / 05:10 PM IST

Boycott Tanishq Jewelery : ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌ పై నెటిజన్లు మండిపడుతున్నారు. తనిష్క్ సంస్థ ఇచ్చిన ఓ ఈ యాడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్‌ కోసం రూపొందించిన ప్రకటనలో ఏముందంటే.. ఓ ముస్లిం కుటుంబం హిందూ యువతిని ఇంటికి కోడలిగా ఆహ్వానించింది.ఆమెకు సీమంతం చేసేందుకు ఆమె హిందూ కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల కావట్టి హిందువుల సంప్రదాయం ప్రకారంగానే చేయాలనుకుంది.



ఆమెకు పుట్టింటి ప్రేమను గుర్తు చేసేలా హిందూ సంప్రదాయం ప్రకారంగా ఘనంగా సీమంతం వేడుక చేస్తుంది. దీనికి సంబంధించి ఈ ప్రకటన 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ‘‘కేవలం ఆమె కోసమే…కోడలి సంతోషం కోసమే ముస్లింలు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి హిందూ సంప్రదాయంలో సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వీడియో ప్రకటనను ‘‘రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’’అని తనిష్క్‌ సంస్థ డిస్క్రిప్షన్‌ పొందుపరిచింది.



ఈ యాడ్ పై కొంతమంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియో, లవ్‌ జిహాదీని ప్రోత్సహించేలా ఉందని..ఇకపై తనిష్క్‌ ఆభరణాలను కొనే ప్రసక్తే లేదంటూ #BoycottTanishq హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.



‘‘అసలు తనిష్క్ కు సిగ్గుందా..ఇటువంటి పిచ్చి పిచ్చి యాడ్‌లు రూపొందించడానికి ఇకనుంచైనా ఇటువంటి పిచ్చి యాడ్లు ఆపేయండి’’ అంటూ ఓ నెటిజన్‌ మండిపడగా..మరొకరు ‘‘ ప్రతీ యాడ్‌లోనూ హిందూ కోడలే ఎందుకు కనిపిస్తోంది. ముస్లిం కోడలిని చూపించవచ్చు కదాంటూ..నిజాన్ని చూపించే దమ్ము లేదా?‘‘ అంటూ కామెండ్స్ తో విరుచుకుపడుతున్నారు.


ఇంకొంత మంది మాత్రం ఈ యాడ్ చాలాబాగుందనీ..సృజనాత్మకతగా ఉందని వినూత్నకు సరిహద్దులు ఉండవనీ మతాలకు ఎందుకు అంటగడుతున్నారని అంటున్నారు. అంతగా తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మతసామరస్యాన్ని పెంచే ఇలాంటి యాడ్‌లను ప్రశంసించకపోగా ట్రోల్‌ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.