సంక్రాంతి నాటికి అందుబాటులోకి బీఎస్ఎన్ఎల్ 5G సేవలు.. రోజు రోజుకు పెరుగుతున్న యూజర్లు

బీఎస్ఎన్ఎల్ 5G సేవలు సంక్రాంతి నాటికి అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

BSNL 5G services to be available by Sankranthi 2025

BSNL 5G services : బీఎస్ఎన్ఎల్ 5G సేవలు సంక్రాంతి నాటికి అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 5G సేవల కోసం 422 పైచిలుకు టవర్లు ఏర్పాటు చేస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్. శ్రీను తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలోఇప్పటికే 88 టవర్లు ఏర్పాటు చేశామని, వీటిని అతి త్వరలో 5G టవర్లుగా మారుస్తామన్నారు. బీఎస్ఎన్ఎల్‌కు వినియోగదారులకు క్రమంగా పెరుగుతున్నారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతనెలలో 10 వేల కనెక్షన్లు, ఈనెలలో 12 వేల కనెక్షన్లు వచ్చాయని.. రోజుకి కనీసం 500 మంది వినియోగదారులు పెరిగారని వెల్లడించారు.

బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల ధరలను పెంచడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 42 వేల మంది 2G, 3G సిమ్ కార్డులు వాడుతున్నారని.. వీరందరూ ఉచితంగా 4G సిమ్ కార్డులను పొందవచ్చన్నారు. సర్వత్ర వైఫై అనే కొత్త ప్రాజెక్టు ప్రవేశపెడుతున్నామని, దీని ద్వారా ఎక్కడున్నా మన ఇంటిలో ఉన్న ఇంట‌ర్నెట్‌తోనే వైఫై సేవలు పొందవచ్చని వివరించారు. పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలతో కూడా చర్చిస్తున్నామని, కృష్ణా జిల్లాలో సర్వత్ర వైఫై పైలట్ ప్రాజెక్టు నడుస్తోందన్నారు.

Also Read: విదేశాలకు వెళ్తున్నారా? జియో కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లు ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

నెలకు 399 రూపాయలకే ఘర్ కా వైఫై ప్లాన్ రూపొందించామని, దీని ద్వారా అపరిమితంగా డేటా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ల్యాండ్ ఫోన్ సర్వీసులను కూడా నిరంతరంగా అందిస్తామని, సెల్ ఫోన్లలో టీవీ సేవలను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు