Budget 2025 : మహిళలకు గుడ్ న్యూస్ .. రూ.2 కోట్ల లోన్.. ఎవరెవరికి వస్తుందో చూడండి..!

Budget 2025 : మహిళల కోసం సరికొత్త స్కీమ్ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కొత్త పథకంతో చాలా మంది మహిళలకు భారీ ఊరట కలుగనుంది.

Budget 2025 : Govt Rolls Out Rs 2 Cr Term Loans

Budget 2025 : ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు ఊరటనిచ్చేలా భారీ ప్రకటన చేసింది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలకు న్యూస్ చెప్పారు.

Read Also : SwaRail Super App : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సరికొత్త ‘స్వరైల్’ సూపర్ యాప్ ఇదిగో.. ఇకపై బుకింగ్ సేవలన్ని ఒకేచోట..!

మహిళల కోసం సరికొత్త స్కీమ్ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కొత్త పథకంతో చాలా మంది మహిళలకు భారీ ఊరట కలుగనుంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల మహిళలకు సులభంగా రుణాలు అందేలా ఈ కొత్త పథకం ప్రవేశపెట్టినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

యూనియన్ బడ్జెట్ 2025-26లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్ పథకం కింద షెడ్యూల్డ్ కులాల మహిళా పారిశ్రామిక వేత్తలకు రుణాలను ఇవ్వనుంది. మొదటిసారిగా సొంతంగా వ్యాపారాలను ప్రారంభించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలను అందించనున్నారు.

5 లక్షల మంది మహిళలకు ప్రయోజనాలు :
మొత్తం 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నట్టు ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్పీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం కింద ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని నిర్మలమ్మ చెప్పారు. దీని ప్రకారం.. ఐదేళ్ల కాలంలో టర్మ్ లోన్స్ అందిస్తామన్నారు.

ఈ స్కీమ్ కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా శిక్షణ తీసుకున్న వారికి ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో బిజినెస్ ఎలా ప్రోత్సహించాలి, నిర్వాహక నైపుణ్యాల అభివృద్ధికి వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించనున్నారు.

Read Also : Budget 2025 : మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.12 లక్షల వరకు నో ఇన్‌కం ట్యాక్స్!

ఆర్థిక మద్దతును అందించడమే కాకుండా ఈ పథకం కింద వ్యవస్థాపక, నిర్వాహక నైపుణ్యాలను బలోపేతం చేయనుంది. అదేవిధంగా, ఆన్‌లైన్ సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను కూడా అందిస్తుంది.