×
Ad

RBI New Rules : బంగారమే కాదు.. వెండిపై కూడా బ్యాంకులో లోన్లు ఇస్తారు తెలుసా? RBI కొత్త మార్గదర్శకాలు తప్పక తెలుసుకోండి!

RBI New Rules : బంగారంపై మాత్రమే కాదు.. వెండిని కూడా తాకట్టుకు పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవచ్చు. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

RBI New Rules

RBI New Rules : మీ ఇంట్లో వెండి ఉందా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ఇకపై బంగారంపై మాత్రమే కాదు.. వెండిపై కూడా బ్యాంకులో లోన్లు తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సరికొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. అతి త్వరలో బంగారం మాదిరిగానే వెండి వస్తువులను కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు.

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి (RBI New Rules) అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ ప్రకారం.. వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (NBFCS) వెండి వస్తువులు, ఆభరణాలు, కాయిన్స్‌ తాకట్టుకు పెట్టుకుని బ్యాంకులో రుణాలు పొందవచ్చు.

ఇందులో వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అన్ని నియంత్రిత రుణదాతలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. స్వల్పకాలిక అవసరాల కోసం బంగారం, వెండి ఆభరణాలు, ఆభరణాలు, వెండి నాణేలను తాకట్టు పెట్టడానికి ఆర్బీఐ అనుమతిస్తుంది.

ఇప్పటికే తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండిని ఉపయోగించి తిరిగి తాకట్టు పెట్టలేరు లేదా రుణాలు ఇవ్వడం కుదరదు. అంతేకాకుండా, బంగారం, వెండి లేదా బంగారు-ఆధారిత సెక్యూరిటీలను (ETF) వంటివి కొనుగోలు చేసేందుకు రుణాలు పొందలేరు.

వెండి రుణాలపై ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇవే..

చిన్న లోన్లకు హైయర్ ఎల్టీవీ లిమిట్స్ :
రుణగ్రహీతలు ఇప్పుడు బంగారం విలువలో 85శాతం వరకు రుణంగా పొందవచ్చు. ఇంతకముందు 75శాతం ఉండగా ఇప్పుడు పెరిగింది. ఈ లోన్-టు-వాల్యూ (LTV) పరిమితి వడ్డీతో సహా మొత్తం రుణ మొత్తాలకు రూ. 2.5 లక్షల వరకు వర్తిస్తుంది. ఉదాహరణకు.. మీ బంగారం విలువ రూ. 1 లక్ష అయితే.. మీరు ఇప్పుడు రూ. 85వేల వరకు రుణం తీసుకోవచ్చు అనమాట.

బుల్లెట్ రీపేమెంట్ లోన్లపై12 నెలల లిమిట్ :
బుల్లెట్ రీపేమెంట్ లోన్లపై వడ్డీ, అసలు చివరిలో కలిసి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అయితే 12 నెలల్లోపు తిరిగి చెల్లించాలి.

Read Also : AP Rains Alert : ఏపీకి ‘మొంథా తుపాను’ ముప్పు.. మీ మొబైల్‌లో మస్ట్‌గా ఉండాల్సిన వెదర్ యాప్స్ ఇవే.. అన్ని రెడీగా పెట్టుకోండి!

తాకట్టు పెట్టిన బంగారం, వెండిపై పరిమితులివే :

  • రుణగ్రహీతలు ఈ కింది వాటిని తప్పనిసరిగా తెలుసుకోవాలి.
  • కిలో వరకు బంగారు ఆభరణాలు
  • 50 గ్రాముల వరకు బంగారు నాణేలు
  • 10 కిలోల వరకు వెండి ఆభరణాలు
  • 500 గ్రాముల వరకు వెండి నాణేలు
  • ఈ పరిమితులు అన్ని బ్యాంకుల్లోని రుణగ్రహీతలకు వర్తిస్తాయి.

తాకట్టు వస్తువులను వేగంగా పొందొచ్చు :
రుణదాతలు తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండిని రుణం ముగిసిన అదే రోజున లేదా 7 రోజుల్లోగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యం అయితే రుణగ్రహీతకు రోజుకు రూ. 5వేలు పరిహారం చెల్లించాలి.

నష్టానికి తప్పనిసరి పరిహారం :
ఆడిట్ సమయంలో తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండి పోయినా లేదా దెబ్బతిన్నా, రుణదాతలు రుణగ్రహీతలకు పూర్తి మొత్తంలో పరిహారాన్ని చెల్లించాలి.

పారదర్శకంగా వేలం ప్రక్రియ :
లోన్ డిఫాల్ట్‌ విషయంలో ఏదైనా బంగారాన్ని వేలం వేయాల్సి వస్తుంది. అలాంటిప్పుడు బంగారాన్ని వేలం వేసే ముందు రుణదాతలు నోటీసు జారీ చేయాలి. రిజర్వ్ ధర మార్కెట్ విలువలో కనీసం 90శాతంగా ఉండాలి.
రెండు విఫలమైన వేలం తర్వాత 85శాతం వేలం వేయగా ఇంకా ఏదైనా మిగిలితే ఆ మొత్తాన్ని 7 రోజుల్లోగా రుణగ్రహీతకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

స్థానిక భాషలో లోన్ నిబంధనలు :
అన్ని రుణ నిబంధనలు, మూల్యాంకన వివరాలను రుణగ్రహీతకు అర్థమయ్యే ప్రాంతీయ భాషలో అందించాలి. చదవడం రాని రుణగ్రహీతల కోసం ఈ వివరాలను వారికి తెలిసినవారి సమక్షంలోనే తెలియజేయాలి.