AP Rains Alert : ఏపీకి ‘మొంథా తుపాను’ ముప్పు.. మీ మొబైల్‌లో మస్ట్‌గా ఉండాల్సిన వెదర్ యాప్స్ ఇవే.. అన్ని రెడీగా పెట్టుకోండి!

AP Rains Alert : ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మొంథా తుపాను ప్రభావంతో ఏ క్షణమైనా భారీ వర్షాలు పడొచ్చు. వెదర్ యాప్స్ ద్వారా వర్ష సూచనలు ఇలా తెలుసుకోవచ్చు.

AP Rains Alert : ఏపీకి ‘మొంథా తుపాను’ ముప్పు.. మీ మొబైల్‌లో మస్ట్‌గా ఉండాల్సిన వెదర్ యాప్స్ ఇవే.. అన్ని రెడీగా పెట్టుకోండి!

AP Rains Alert

Updated On : October 26, 2025 / 3:56 PM IST

AP Rains Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మొంథా తుపాను ముంచుకొస్తోంది. ఇప్పటికే తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. అంతేకాదు.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయట.. అలాగే కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ అయింది.

మొంథా తుపాను తీరం దాటే (Cyclone Montha) సమయానికి గంటకు 90కి.మీ నుంచి 100కి.మీ గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలు సముద్ర తీర ప్రాంతాల్లోని పోర్టుల్లో కూడా మొదటి హెచ్చరిక జారీ అయింది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇంటివద్దనే ఉండాలని, బయటకు అసలు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

మీ మొబైల్‌లో వెదర్ రిపోర్ట్స్ :
ప్రస్తుతం ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. చాలామంది ప్రజలకు ఎప్పుడు వర్షం పడుతుంది? ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది అవగాహన ఉండదు. వర్ష సూచనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు.

అది కూడా మీ మొబైల్ ఫోన్లలోనే వెదర్ రిపోర్ట్స్ చూడొచ్చు.. ఎప్పుడు వర్షం పడుతుంది? ఏ సమయంలో పడుతుంది? అనే పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సింపుల్‌గా మన ఫోన్‌లోనే వెదర్ రిపోర్ట్స్‌ను చెక్ చేయొచ్చు. మీరు ఉండే ప్రాంతంలో వర్ష ప్రభావం ఉంటుందా? ఉంటుందా? లేదో ముందుగానే వర్షం పడుతుందో లేదో తెలుసుకోవచ్చు. మన మొబైల్ ఫోన్లలో ఉండాల్సిన కొన్ని బెస్ట్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఓసారి తెలుసుకుందాం..

ది వెదర్ ఛానల్ (The Weather Channel) :

వాతావరణానికి సంబంధంచి అన్ని ప్రశ్నలకు వెదర్ ఛానల్ అనేది గో-టు యాప్. ఈ యాప్‌లో వెదర్ ఛానల్ నుంచి అనేక వీడియోలు ఉంటాయి. ఈ యాప్‌లో వర్షానికి సంబంధించి అప్‌డేట్స్ పొందవచ్చు. హెల్త్, లైఫ్ స్టయిల్ వార్తలను కూడా యాప్‌లో చూడవచ్చు. ఈ యాప్ గంటవారీ టెంపరేచర్, రోజంతా వర్షపు పడుతుందా లేదా అనే కచ్చితమైన వాతావరణ వివరాలను అందిస్తుంది. మీ ప్రాంతంలో వాతావరణ రాడార్ అనేక వాతావరణ హెచ్చరికలు కూడా తెలుసుకోవచ్చు. యాప్ ప్రైవసీపరంగా మీ డేటాను కలెక్ట్ చేసి షేర్ చేయొచ్చు.

మీ డేటాను యాప్ నుంచి డిలీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. వెదర్ ఛానల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ ద్వారా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్ అయితే యాడ్స్ ఉంటాయి. యాడ్స్ రాకుండా ఉండాలంటే నెలకు 1.99డాలర్లకు సభ్యత్వాన్ని పొందవచ్చు. మొత్తం ఏడాదికి 9.99 డాలర్లు ముందుగానే చెల్లించవచ్చు. నెలకు 4.99 డాలర్లు లేదా ఏడాదికి 29.99 డాలర్లు (రూ. 2,633) యాప్ ప్రీమియం వెర్షన్‌ కూడా సభ్యత్వాన్ని పొందవచ్చు.

Read Also : మొంథా తుపాను.. 27, 28, 29 తేదీల్లో ఈ ఉద్యోగుల సెలవులు రద్దు.. మీ జిల్లాల్లో మీకు సమస్యలు ఎదురైతే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి..

అక్యూవెదర్ (AccuWeather) :
ఈ అక్యూవెదర్ యాప్ మినిట్‌క్యాస్ట్ అందిస్తుంది. రాబోయే 2 గంటలలో నిమిషానికి నిమిషానికి వర్ష సూచనలను అందిస్తుంది. వర్షం ఎప్పుడు వస్తుంది? ఆగిపోతుంది? నిర్దిష్ట సమయంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో అనేది తెలియజేస్తుంది. ఈ యాప్ రోజువారీ ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తు అంచనాలు వంటి వాతావరణ వివరాలను అందిస్తుంది. అక్యూవెదర్ ఉచిత వెర్షన్ అనేక ఫీచర్లు కలిగి ఉంది. అదే ప్రీమియం వెర్షన్ వాతావరణ నిపుణుల విశ్లేషణ, హైపర్-లోకల్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి అక్యూవెదర్ యాప్ ఫ్రీ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ప్రీమియం వెర్షన్ 7 రోజుల పాటు ఫ్రీగా లభిస్తుంది. మీరు నెలకు 1.99 డాలర్లు లేదా సంవత్సరానికి 12.99 డాలర్లు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రీమియం ప్లస్ వెర్షన్ మొదటి 7 రోజులు ఫ్రీగా లభిస్తుంది. నెలకు 3.99 డాలర్లు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ లేదా 24.99 డాలర్లు (రూ. 2194) వార్షిక సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలి.

వెదర్‌బగ్ (WeatherBug) :

వెదర్‌బగ్ యాప్ అనేది ప్రాంతీయ వర్షసూచన అంచనాలు, వాతావరణ హెచ్చరికలను అందిస్తుంది. నిర్దిష్ట ప్రదేశాలు, వాతావరణ పరిస్థితులు, హెచ్చరికలపై పూర్తి వివరాలను అందిస్తుంది. ఈ యాప్ ముఖ్యంగా రియల్-టైమ్ వెదర్ డేటాను అందిస్తుంది. పిడుగులతో వర్ష సూచనలు అలర్ట్స్, గంటవారీ నుంచి 10 రోజుల అంచనాలు, రెయిన్ రాడార్, భారీ తుఫాను ముప్పు వంటి మ్యాప్ లేయర్లతో అనేక ఫీచర్లను అందిస్తుంది.

ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో ఫ్రీ, ప్రీమియం వెర్షన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెదర్‌బగ్ ఫ్రీ వెర్షన్ యూజర్లకు రియల్ టైమ్ అంచనాలు, తీవ్రమైన వాతావరణ హెచ్చరికలను తెలుసుకోవచ్చు. ప్రీమియం వెర్షన్ అయితే యాడ్ లేకుండా వ్యూ, అడ్వాన్స్ యాక్టివిటీలను అందిస్తుంది. ఈ ప్రీమియం యాప్ కోసం మీరు నెలకు రూ.199 సబ్‌స్క్రిప్షన్ లేదా రూ.999 వార్షిక సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలి.

వెదర్ అండర్‌గ్రౌండ్ (Weather Underground) :

వెదర్ అండర్ గ్రౌండ్ యాప్ ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, అంచనాలు, రాడార్ ఫొటోలు, తీవ్రమైన వాతావరణ హెచ్చరికలను అందిస్తుంది. రియల్ టైమ్ వాతావరణ డేటాను అందిస్తుంది. ప్రధాన నగరాల్లో వెదర్ రిపోర్టులను అందిస్తుంది. వివిధ వెబ్‌సైట్‌లు, వార్తాపత్రికలకు స్థానిక వాతావరణ రిపోర్టులను కూడా అందిస్తుంది.

ప్రాథమిక సూచనలతో పాటు వాతావరణ డేటా, వాతావరణ మార్పు సమాచారం, కమ్యూనిటీ ఆధారిత వాతావరణానికి సంబంధించి వివరాలను అందిస్తుంది. వెదర్ అండర్‌గ్రౌండ్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏడాదికి 9.99 డాలర్లు యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ పొందవచ్చు.

ది వెదర్ (The Weather) :
మౌసమ్ (Mausam) అనేది భారత వాతావరణ శాఖ (IMD) అభివృద్ధి చేసిన వాతావరణ సూచన యాప్. ఈ యాప్ దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, సూచనలు, రియల్ టైమ్వాతావరణ అప్‌డేట్స్, తీవ్రమైన వాతావరణ హెచ్చరికలను అందిస్తుంది. రోజువారీ, గంటవారీ వాతావరణ సూచనలు,  వాతావరణ సూచనలు, వాతావరణ రాడార్, వాతావరణ పీడనం వంటి ఇతర వాతావరణ డేటాను కూడా అందిస్తుంది.

మౌసమ్ యాప్ తెలుగు, పంజాబీ, తమిళం, మలయాళం, ఉర్దూ, హిందీ, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, మరాఠీ ఒరియాతో సహా 12 భారతీయ భాషలకు సపోర్టు ఇస్తుంది. ఈ యాప్ ఇంగ్లీష్ కూడా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉంది. ప్రభుత్వ యాప్ కావడంతో ఫ్రీగా వాడుకోవచ్చు.