ఫ్రాన్స్ మల్టీటెక్నాలజీ సంస్థ క్యాప్ జెమిని కూడా ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టింది. కాగ్నిజెంట్ టెక్ సంస్థ బాటలోనే క్యామ్ జెమిని ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. దేశంలో మందగమనం కారణంగా చూపుతూ ఇండియాలోని తమ కంపెనీలో పనిచేసే దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. దేశంలోని తమ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టుల్లో వృద్ధి నెమ్మదించడంతో మరింత భారంగా మారింది.
ఫలితంగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఓ నివేదిక తెలిపింది. ఇండియాలో క్యాప్ జెమినీ టెక్ కంపెనీకి చెందిన పలు బ్రాంచుల్లో లక్ష మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేసే ఉద్యోగుల్లో కంటే సగానికి పైగా ఇండియాలోనే ఉన్నారు. ‘ఐటీ సర్వీసు కంపెనీగా.. మా వారంతా మా వ్యాపారానికి గుండెలా వాటివారు. అందుకే దేశవ్యాప్తంగా శ్వాశతంగా రీస్కిల్లింగ్ ప్రొగ్రామ్ లను ప్రవేశపెడుతున్నాము.
క్లయింట్లకు కావాల్సిన కొత్త సామర్థ్యాలను మెరుగుపర్చాలని భావిస్తున్నాం. 2020 నాటికి ఇండియాలో మరింత వృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని కంపెనీ తెలిపినట్టు రిపోర్టు పేర్కొంది. క్యాప్ జెమినీ తమ కంపెనీలో ఉద్యోగులను తొలగించే ముందు 90 రోజుల పాటు బెంచ్ పై ఉంచుతుంది. కార్పొరేట్ స్థాయిలో ఏదైనా ప్రాజెక్టులను తీసుకొచ్చేంత వరకు వారిని అలానే ఉంచుతుందని నివేదిక తెలిపింది. ఎవరైతే ప్రాజెక్టులను తీసుకురావడంతో విఫలం అవుతారో వారిని చివరికి రిజైన్ చేసి వెళ్లిపోమని కంపెనీ చెబుతుంది.
భారత్ లోని టెక్ సర్వీసు కంపెనీలు ఆదాయ వృద్ధిని పెంచుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టెక్ కంపెనీల్లో ఒక క్యాప్ జెమినీ మాత్రమే ఉద్యోగులను తొలగించడం లేదు. అక్టోబర్ 31న ఐటీ సర్వీసెస్ సంస్థ కాగ్నిజెంట్ కూడా యావరేజ్ నుంచి సీనియర్ ఉద్యోగుల్లో 10వేల నుంచి 12వేల మందిని తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.