Car Loan Rates : కొత్త కారు కొంటున్నారా? అత్యంత చౌకైన కారు లోన్లు అందించే బ్యాంకులివే.. వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Car Loan Rates : కారు లోన్ తీసుకుంటున్నారా? ఏప్రిల్ 2026లో అత్యంత చౌకైన ధరకే కారు లోన్ తీసుకోవచ్చు.. అయితే ఏ బ్యాంకు కారు లోన్ తక్కువ ధరకే అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..
Car Loan Rates
- కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?
- ఏప్రిల్‌లో అత్యంత చౌకైన కారు లోన్ ఎలా పొందాలి?
- ఏయే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే కారు లోన్లు ఇస్తాయి?
Car Loan Rates : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? బ్యాంకు నుంచి కారు లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. ముందుగా ఏప్రిల్ 2026లో దేశంలోని కొన్ని ప్రముఖ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే కారు లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ సొంత కారు ఉండాలని కలలు కంటారు. కానీ, కారు కొనేందుకు లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
అదే సామాన్యులు అయితే కొత్త కారు కొనడం కష్టమే. అందుకే చాలా మంది బ్యాంకు నుంచి కారు లోన్ తీసుకుంటుంటారు. నెలవారీ ఈఎంఐలు చెల్లిస్తూ తమ సొంత కారు కలను నెరవేర్చుకుంటారు. మీరు కూడా ఈ ఏప్రిల్ నెలలో బ్యాంకు నుంచి కారు లోన్ తీసుకోవాలనుకుంటే.. మీరు ముందుగా వివిధ బ్యాంకుల్లో కారు లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కారు లోన్ :
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు 9 శాతం నుంచి వడ్డీ రేట్లతో కారు లోన్లను అందిస్తుంది. కస్టమర్ క్రెడిట్ స్కోర్, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి ఈ వడ్డీ రేట్లు మారవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కారు లోన్ ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం, కనీసం రూ. 3,500 అవసరం. ఇంకా అనేక అదనపు ఛార్జీలు కూడా ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంక్ కారు లోన్ :
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు 8.95 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటుతో కారు లోన్లను అందిస్తుంది. కస్టమర్ అర్హతను బట్టి ఈ వడ్డీ రేట్లు మారవచ్చు. ప్రాసెసింగ్ ఫీజులు రూ. 3,500 నుంచి రూ. 12వేల వరకు ఉండవచ్చు. అనేక అదనపు ఛార్జీలు కూడా ఉంటాయి.
ఎస్బీఐ కారు లోన్ :
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బిఐ యూజర్లకు 8.90 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు లోన్లను అందిస్తుంది. వినియోగదారుడి క్రెడిట్ స్కోర్, అర్హతను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ లోన్‌కు ప్రాసెసింగ్ ఫీజు ఒక శాతం, గరిష్ట మొత్తం రూ. 10వేల నుంచి అందుబాటులో ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కారు లోన్ :
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) తమ కస్టమర్ల కోసం 7.60 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు లోన్లను అందిస్తోంది. వినియోగదారుడి క్రెడిట్ స్కోర్, అర్హతను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. 1,500 నుంచి ప్రారంభమవుతుంది.
