భారతీయ ఆటో ఇండస్ట్రీ 2019లో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. కార్లు ఎస్‌యూవీల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో భారతీయ ఆటో పరిశ్రమ 2019 సంవత్సరంలో అత్యంత కష్టతరమైన కాలాల్లో ఒకటిగా నిలిచింది. అధిక డిస్కౌంట్లు ఉన్నప్పటికీ పెరుగుతున్న అనిశ్చితులు, కష్టమైన ఫైనాన్సింగ్, ఆర్థిక తిరోగమనం కొనుగోలుదారులను దూరంగా ఉంచడంతో రెండు దశాబ్దాలలో అతిపెద్ద క్షీణతను 2019లో భారత ఆటో ఇండస్ట్రీ చూడాల్సివచ్చింది. కష్టతరమైన మార్కెట్లో కూడా బలమైన ఓపెనింగ్‌ను ఆశ్చర్యకరంగా రాబట్టిన కియా మోటార్స్ మరియు ఎంజి మోటార్స్ వంటి కొత్త బ్రాండ్ల ఎంట్రీ ఉన్నప్పటికీ మొత్తంగా అమ్మకాల సంఖ్య పడిపోయింది.
ఆటో పరిశ్రమ నుండి వచ్చిన సంఖ్యల ప్రకారం… ప్రయాణికుల వాహనాల అమ్మకాలు (కార్లు, వ్యాన్లు మరియు ఎస్‌యూవీలు) 2019 లో3 మిలియన్ల మార్కు కంటే తక్కువకు పడిపోయింది, 2017 లో మొదటిసారిగా ఈ సంఖ్యను ఆటో పరిశ్రమ దాటిన విషయం తెలిసిందే. క్షీణతకు దారితీసిన వాటిలో టాప్ బ్రాండ్స్… మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్, హోండా, టయోటా ఉన్నాయి.
2018 మధ్యకాలం నుంచి ఆటో పరిశ్రమలో అమ్మకాల సంఖ్యలు తగ్గడం ప్రారంభమైంది. తర్వాత నెలల్లో అమ్మకాల క్షీణత మరింత లోతుగా, పదునుగా రావడం ప్రారంభమైంది. 2019 లో అది మరింత స్పష్టంగా కనిపించింది. ఆర్థికవృద్ధి ఒత్తిడిలో పడటం, రాజకీయ అనిశ్చితులు, జాతీయ ఎన్నికలకు సంబంధించి, రాజకీయ అనిశ్చితులు పెరగడం దీనికి కారణం. మరియు, NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) సంక్షోభం తరువాత ద్రవ్య ఒత్తిళ్లు పెరగడం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా మారడం వంటి ఇష్యూల కారణంగా ఆటో పరిశ్రమ కుప్పకూలిపోవడం ప్రారంభమైంది. 2019 క్లిష్టమైన ఏడాదిగానే గడిచిందని,కానీ కొత్త ఏడాది ఆశాభావంతో ముందుకెళ్తున్నట్లు మారుతీ సుజుకీ డైరక్టర్(మార్కెటింగ్&సేల్స్)శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.