Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లపై క్రేజీ డీల్స్.. గెట్ రెడీ..!
Flipkart Big Billion Days Sale 2025 : ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Flipkart Big Billion Days Sale 2025
Flipkart Big Billion Days Sale 2025 : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 అతి త్వరలో ప్రారంభం కానుంది. భారత అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 22 నుంచే ముందస్తుగా (Flipkart Big Billion Days Sale 2025) యాక్సెస్ పొందవచ్చు. ఈ ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఉన్న ఆపిల్ ఐఫోన్ మోడళ్లపై ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
రూ.40వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 14 :
ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ A15 బయోనిక్ చిప్‌పై రన్ అవుతుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 12MP మెయిన్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ కలిగి ఉంది. డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్‌కు సపోర్టు ఇస్తుంది. 20W అడాప్టర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ ధర : రూ. 40వేల కన్నా తక్కువ
రూ.50వేల లోపు ఐఫోన్ 15 :
A16 బయోనిక్ చిప్‌తో ఐఫోన్ 15 అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 48MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మ్యాగ్ సేఫ్ సపోర్టు, స్పీడ్ ఛార్జింగ్‌తో రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ ధర : రూ. 50వేల లోపు
ఐఫోన్ 16 ధర రూ. 51,999 :
ఐఫోన్ 16 లేటెస్ట్ A18 చిప్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్ కలిగి ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది. 1,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, 2x టెలిఫోటోతో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ ఆటోఫోకస్‌తో 12MP ట్రూడెప్త్ కెమెరాను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ ధర రూ. 51,999
రూ. 90వేల లోపు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ :
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ప్రోమోషన్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, (6.3-అంగుళాలు, 6.9-అంగుళాల) ఉంటాయి. 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌లో 5x జూమ్‌తో 48MP మెయిన్, 48MP అల్ట్రా-వైడ్, 12MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్రో ధర : రూ. 74,999 (కార్డ్ ఆఫర్లతో రూ. 69,999)
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర : రూ. 94,999 (కార్డ్ ఆఫర్లతో రూ. 89,999)
భారతీయ కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025పై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ కార్డ్ డీల్స్‌తో పొందవచ్చు. లేటెస్ట్ ఐఫోన్‌లపై కూడా భారీ తగ్గింపు పొందవచ్చు. రూ. 40వేల కన్నా తక్కువ ధరకు ఐఫోన్ 14 లేదా ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ. 90వేలు కన్నా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.