Amazon Early Deals 2025 : అమెజాన్ అద్భుతమైన డీల్స్.. స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు.. ఇలాంటి డీల్స్ అసలు మిస్ చేయొద్దు!
Amazon Early Deals 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అమెజాన్ ఎర్లీ డీల్స్ 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Early Deals 2025
Amazon Early Deals 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 తేదీలను అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో సేల్ ప్రారంభం కానుంది. ఈ పండుగ సేల్‌కు ముందుగానే, కంపెనీ సెప్టెంబర్ 13 నుంచి కొత్త సేల్‌ను ప్రారంభించింది.
ఈ అమెజాన్ ఎర్లీ డీల్స్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలతో (Amazon Early Deals 2025) సహా ఎలక్ట్రానిక్స్‌పై 40 శాతం నుంచి 80 శాతం వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ ఏడాదిలో అమెజాన్ యూజర్లకు ఏఐ ఆధారిత షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అన్ని డీల్స్‌కు 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లతో స్పెషల్ “ప్రైమ్ ధమాకా” ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఏడాదిలో ఫెస్టివల్ సేల్ సందర్భంగా లక్ష కన్నా ఎక్కువ ప్రొడక్టులు అతి చౌకైన ధరలకు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. అదనంగా, శాంసంగ్, ఆపిల్, వన్‌ప్లస్, ఐక్యూ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లపై వినియోగదారులు 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
స్మార్ట్ఫోన్లపై ఎర్లీ డీల్స్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ ముందస్తు డీల్స్ వెల్లడయ్యాయి. గత ఏడాదిలో లాంచ్ అయిన ఈ మిడ్-రేంజ్ ఫోన్ ప్రారంభ ధర రూ.18,499 నుంచి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఐక్యూ జెడ్10 లైట్ 5జీ ఫోన్ కూడా ఈ ప్రారంభ డీల్స్‌లో ధర రూ.10,998కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 6.74-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది.
స్మార్ట్ టీవీలపై ఎర్లీ డీల్స్ :
అమెజాన్‌లో QLED, మినీ LED, OLED 4K స్మార్ట్ టీవీలను ఇప్పటివరకు అత్యల్ప ధరలకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు అనేక బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలపై వినియోగదారులకు రూ. 20వేల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఇంకా, ఏఐ ఎనేబుల్డ్ పీసీల కొనుగోలుపై రూ. 10వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లను నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పొందవచ్చు.