Gold Prices : బంగారం లాంటి వార్త.. డబ్బులు రెడీ చేసుకోండి.. గోల్డ్ రేట్లు తగ్గబోతున్నాయ్..!
Gold Prices : పెట్టుబడిదారులు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశం నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Gold Prices
Gold Prices : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనాలని అనుకునేవారికి అదిరిపోయే వార్త.. బంగారం ధరలకు సంబంధించి అతి త్వరలో పెద్ద శుభవార్త అందనుంది. బంగారం కొనేందుకు ప్లాన్ చేసుకోండి. డబ్బులు రెడీ చేసుకోవడమే ఆలస్యం.. ఎందుకంటే.. బంగారం ధరలు తగ్గబోతున్నాయి.. మీరు చదివింది నిజమే.. రానున్న రోజుల్లో బంగారం ధరలు అమాంతం తగ్గుతాయని భావిస్తున్నారు.
అయితే, సెప్టెంబర్ 17న జరిగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారాని పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ముఖ్యంగా ట్రేడర్లు యూకే, యూరో జోన్‌తో సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల నుంచి ద్రవ్యోల్బణ డేటాను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ విధాన నిర్ణయాలను కూడా ట్రాక్ చేయనున్నారు. ఈ క్రమంలో బులియన్ మార్కెట్లో సానుకూల సంకేతాలను అందించే అవకాశం కనిపిస్తోంది.
10శాతానికి పైగా పెరిగిన బంగారం :
బంగారం ధరలు సానుకూల జోరు కొనసాగించాయి. వరుసగా నాలుగో వారం కూడా ధరలు పెరిగాయి. అయితే, వారం మధ్యలో బంగారం ధర కాస్త మందగించింది. గత నాలుగు వారాలలో 10 శాతానికి పైగా బంగారం ధరలు పెరిగాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ వివాదం, యూరప్, ఆసియాలో రాజకీయ మార్పులు బులియన్ ధరల పెరుగదలకు ఊతమిచ్చాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ డెలివరీకి అత్యధికంగా ట్రేడ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,616 లేదా 1.5 శాతం పెరిగాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 3,686.40 డాలర్ల వద్ద ముగిసి సెప్టెంబర్ 9న 3,715.20 డాలర్లకి చేరుకుంది.

Gold Prices down
ఇటీవలి వారాల్లో రష్యా-ఉక్రెయిన్ వివాదం తీవ్రతతో పాటు, అమెరికాలోకి భారత దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ గోల్డ్ ర్యాలీ పెద్దగా ఆశ్చర్యం కలిగించదని ఈబీజీ వైస్ ప్రెసిడింట్ డీవీపీ రీసెర్చర్ ప్రథమేష్ మాల్యా అన్నారు. మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు తాజా రికార్డు గరిష్టాలకు చేరుకుని వారం పొడవునా ర్యాలీని విస్తరించిందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విశ్లేషకురాలు రియా సింగ్ అన్నారు.
40శాతానికిపైగా లాభంతో.. :
1980 నాటి ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిని అధిగమించి ఔన్సుకు 3,700 డాలర్లు దాటిందని చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40 శాతం కన్నా ఎక్కువ లాభంతో బంగారం ధర పెరిగిందని ఆమె పేర్కొన్నారు.
బులియన్ మార్కెట్లలో కేంద్ర బ్యాంకుల నేతృత్వంలోని సంస్థాగత డిమాండ్, భారత్, చైనాలో బలహీనమైన ఆభరణాల అమ్మకాల ప్రభావంతో మార్కెట్ తగ్గిందని తెలిపారు. ప్రస్తుత స్థాయిల కన్నా ఇంకా తగ్గితే ఈ ఏడాది చివరిలో కామెక్స్‌లో 4వేల డాలర్ల మార్కుకు, ఎంసీఎక్స్‌లో 10 గ్రాములకు రూ.1,15,000 మార్కుకు దారితీయవచ్చునని సింగ్ పేర్కొన్నారు.
బంగారాన్ని మించిన వెండి ధరలు :
వెండి ధర, బంగారం ధర పెరుగుదలకు అద్దం పట్టింది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్సుకు 1.62 శాతం పెరిగి 42.83 డాలర్లకు చేరుకుంది. ఇంట్రాడేలో 43.04 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ కిలోగ్రాముకు జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,29,392కి పెరిగింది.

Gold Price
వెండి బంగారం కన్నా శాతంలో ముందుంది. గత వారం వెండి 2011 నుంచి అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 40 శాతం లాభాన్ని నమోదు చేసిందని సింగ్ తెలిపారు. వెండిలోకి ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు 1.13 బిలియన్ ఔన్సులను దాటి 40 బిలియన్ డాలర్లకు పైగా విలువ పెరిగిందని అన్నారు.
వెండి పారిశ్రామిక వినియోగంలో ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ ధర బంగారం కన్నా ఎక్కువ అస్థిరంగా ఉంటుందని ఆమె అన్నారు. అలాగే కొనసాగితే కామెక్స్‌లో ఔన్సుకు 43 డాలర్లు, ఎంసీఎక్స్ లో కిలోగ్రాముకు రూ. 1,35,000 నుంచి రూ. 1,38,000 వరకు మధ్యస్థ కాలంలో అడ్వాన్స్ సాధ్యమవుతుందని రియా సింగ్ తెలిపారు. కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, సురక్షితమైన డిమాండ్, ప్రపంచ కేంద్ర బ్యాంకుల విధాన సడలింపు అంచనాలు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.