Cars Discontinue: ఏప్రిల్ నుంచి ఈ కార్ల అమ్మకాలు నిలిచిపోతాయా.. కారణం అదేనా?

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని కార్ల అమ్మకాలను నిలిపివేయాలని తయారీ సంస్థలు నిర్ణయించాయి. దీనికి కారణం ఉంది. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రకారం.. ఎప్పటికప్పుడు ప్రమాణాల్ని మెరుగుపరుస్తోంది. దీనిలో భాగంగా వాహనాలు తక్కువ కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేయాలి.

Cars Discontinue: వచ్చే ఏప్రిల్ నుంచి కొన్ని కార్ల అమ్మకాలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని కార్ల అమ్మకాలను నిలిపివేయాలని తయారీ సంస్థలు నిర్ణయించాయి. దీనికి కారణం ఉంది. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా

దీని ప్రకారం.. ఎప్పటికప్పుడు ప్రమాణాల్ని మెరుగుపరుస్తోంది. దీనిలో భాగంగా వాహనాలు తక్కువ కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేయాలి. వీటి కోసం ఆర్డీఈ (రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్) నిబంధనల్ని రూపొందించింది. మార్కెట్లోకి రాబోయే ప్రతి వాహనం బీఎస్6, రెండో దశ ప్రమాణాలను పాటించాలి. అంటే ఇకపై అమ్మబోయే వాహనాలు ఈ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉండాలి. వీటికి అనుగుణంగా లేని వాహనాలను అమ్మడం కుదరదు. రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమలవుతుంది. దీంతో ఈ రూల్స్‌కు అనుగుణంగా లేని కార్లు, ఇతర వాహనాల విక్రయాలను కంపెనీలు నిలిపివేయబోతున్నాయి.

Chhattisgarh: విద్యార్థులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు విద్యార్థులు మృతి

ఈ విషయాన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. రెనాల్ట్ క్విడ్ 800 సీసీ, హోండా అమేజ్ కార్ల విక్రయాలు ఆగిపోతాయి. అలాగే హోండా డబ్ల్యూఆర్-వి, ఫోర్త్ జనరేషన్ హోండా సిటీ, హోండా జాజ్ తయారీని హోండా నిలిపివేయబోతుంది. హ్యుండాయ్ ఐ20, గ్రాండ్ ఐ10, ఆరా సబ్‌కాంపాక్ట్ సెడాన్, మారుతి సుజుకి ఆల్టో 800, మహీంద్రా అండ్ మహీంద్రా ఆల్టరస్ జీ4, నిస్సాన్, స్కోడా ఆక్టేవియా కార్ల అమ్మకాలు కూడా నిలిచిపోనున్నాయి.