Chhattisgarh: విద్యార్థులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు విద్యార్థులు మృతి

గురువారం స్కూలు విద్యార్థులతో ఉన్న ఆటో రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. దీంతో ఆటో చాలా దూరం ఎగిరిపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఏడుగురు మరణించారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

Chhattisgarh: విద్యార్థులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు విద్యార్థులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటోపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌, కాంకర్ జిల్లా, కోరార్ గ్రామ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం స్కూలు విద్యార్థులతో ఉన్న ఆటో రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది.

Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా

దీంతో ఆటో చాలా దూరం ఎగిరిపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఏడుగురు మరణించారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన ఇద్దరినీ కోరార్‌లోని ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ప్రాంత ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.

ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘెల్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.