అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ టారిఫ్‌లు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని చెప్పింది.
చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లను విధించుకుంటూ పోతున్న నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ కూడా అదే పని చేసుకుంటూ పోతోంది. దీంతో చివరకు ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం బంద్ అయ్యే పరిస్థితులు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
చైనాపై ట్రంప్ సుంకాలను 145 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. చైనాపై అమెరికా విధిస్తున్న సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నియమాలు, ఆర్థిక చట్టాలను ఉల్లంఘించడమేనని డ్రాగన్ కంట్రీ అంటోంది. ట్రంప్ విధిస్తున్న సుంకాల ద్వారా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక ప్రతికూల దుస్థితిపై అమెరికా బాధ్యత వహించాలని చెప్పింది.
గ్లోబల్‌గా తొలి రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా. ఈ ఇరు దేశాలు కొన్ని రోజులుగా అదనపు టారిఫ్‌లు విధించుకుంటూ పోతుండడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అమెరికా 2024లో చైనాకు 143.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో 438.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.
ఇలా పెంచుకుంటూ పోయారు..