భారతదేశంలో జాయింట్ వెంచర్లతో సహా చైనా కంపెనీలను హైవే ప్రాజెక్టులలో అనుమతించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖలో చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రి వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME) వంటి వివిధ రంగాలలో చైనా పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరకుండా ప్రభుత్వం చూస్తుందని గడ్కరీ అన్నారు. గత నెలలో 20 మంది భారతీయ ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఉద్రిక్తతల మధ్య, జాతీయ భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ 59 యాప్‌లపై ప్రభుత్వం నిషేధించింది. రహదారి నిర్మాణానికి చైనా భాగస్వాములను కలిగి ఉన్న జాయింట్ వెంచర్లకు అనుమతి ఇచ్చేది లేదని పేర్కొన్నారు.
మన దేశంలో (చైనీస్ కంపెనీలు) జాయింట్ వెంచర్ ద్వారా వస్తే.. తాము అనుమతించమని గడ్కరీ అన్నారు. త్వరలో చైనా సంస్థలను నిషేధించడం, హైవే ప్రాజెక్టులలో పాల్గొనడానికి వారి అర్హత ప్రమాణాలను విస్తరించడానికి భారతీయ కంపెనీలకు నిబంధనలను సడలించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం చాలా ముందుగానే చేపట్టిన కొన్ని ప్రాజెక్టులలో కొంతమంది చైనా భాగస్వాములు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత, భవిష్యత్ టెండర్లలో కొత్త నిర్ణయం అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఉన్న టెండర్లు, భవిష్యత్ బిడ్లకు సంబంధించి, చైనా జాయింట్ వెంచర్లు ఉంటే పునర్నిర్మాణం జరుగుతుందని గడ్కరీ చెప్పారు. చిన్న కంపెనీలు పని చేయడానికి అర్హత సాధించగలవని ఆయన అన్నారు. ఒక కాంట్రాక్టర్ ఒక చిన్న ప్రాజెక్టుకు అర్హత సాధిస్తే.. అతను కూడా ఒక పెద్ద ప్రాజెక్టుకు అర్హత సాధించే అవకాశం లభిస్తుందని గడ్కరీ అన్నారు.
టెక్నాలజీ, కన్సల్టెన్సీ లేదా డిజైన్ రంగాలలో విదేశీ జాయింట్ వెంచర్ కోసం వెళ్లినా చైనీయులను అనుమతించమని గడ్కరీ చెప్పారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలనే నిర్ణయం ఉందని, చైనా పెట్టుబడిదారులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. టెక్నాలజీ, రీసెర్చ్, కన్సల్టెన్సీ, ఎంఎస్ఎంఇలలో విదేశీ పెట్టుబడులు, జాయింట్ వెంచర్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. కానీ, చైనీస్ విషయంలో అనుమతించమని చెప్పారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య, భారత దేశపు కస్టమ్స్ అధికారులు పొరుగు దేశం నుంచి ప్రత్యేకంగా చెన్నై, విశాఖపట్నం ఓడరేవుల నుంచి వచ్చే అన్ని సరుకులను తనిఖీ చేస్తున్నారు.
Read:India ఉద్యోగులకు TikTok సీఈఓ స్పెషల్ మెసేజ్