కర్నూలు: రాయలసీమలో నూతనంగా నిర్మించిన నాలుగో ఎయిర్ పోర్టును సీఎం చంద్రబాబు నాయుడు జనవరి 7న ప్రారంభించనున్నారు.కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టులో డిసెంబర్ 31న ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో బయలుదేరిన సెస్నా సైటేషన్ సిజే2 మోడల్ విమానం విజయవంతంగా ఓర్వకల్లు రన్ వే పై ల్యాండ్ అయ్యింది. ట్రయల్ రన్ చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు. 2017 జూన్ లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఎయిర్ పోర్టులో రూ.90.5 కోట్లతో టర్మినల్, అప్రాన్, టవర్ భవనం, రన్ వే, అప్రోచ్ రోడ్లు నిర్మాణాలు పూర్తి చేశారు. విమానాశ్రాయంలో టెర్మినల్ ప్లాంట్, ప్రయాణికుల విశ్రాంతి భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ పనులు అభివృధ్ధి దశలో ఉన్నాయి.