నిజం తెలుసా: కార్లపై రూ.12వేల అదనపు ట్యాక్స్

కాలుష్యం నుంచి విముక్తి కోసం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే ఐదేళ్లలో భారీ మార్పులకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది.

  • Publish Date - December 28, 2018 / 11:58 AM IST

కాలుష్యం నుంచి విముక్తి కోసం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే ఐదేళ్లలో భారీ మార్పులకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది.

హైదరాబాద్ : కాలుష్యం నుంచి విముక్తి కోసం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే ఐదేళ్లలో భారీ మార్పులకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ కార్లను కొనే వారికి రూ. 12వేలు అదనంగా వర్తించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ ఓ నివేదిక తయారు చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలు, కార్లు కొనే వారికి.. మొదటి ఏడాదిలో రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింాది. ఇంధన ఏజెన్సీ వారికి ప్రోత్సాహకాలు కూడా అందుతాయని కేంద్రం స్పష్టం చేసింది.
అందులో భాగంగా మొదటి సంవత్సరానికి రూ. 7వేల 500 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తోంది. జీరో రోడ్ ట్యాక్స్ చేయడమే కాకుండా ఎలాంటి కస్టమ్ డ్యూటీ విధించకుండా చర్యలు తీసుకుంది. ఐదేళ్లలో ఎలక్ట్రిక్ కార్లు, టూ వీలర్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ప్రోత్సాకాల రూపంలో రాయితీ కల్పించేందుకు భారీగానే ఖర్చు చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఎలా విస్తరించాయో.. అదే రీతిలో అన్ని ప్రధాన నగరాల్లో విరివిగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందుకు అదనంగా కోట్ల రుపాయలు వెచ్చించడానికి సిద్దమవుతోంది.