Cooking Gas LPG Price: షాకింగ్.. వంట గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచిన కేంద్రం.. ఒక్కో గ్యాస్ బండపై..

కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం దీనిపై వివరాలు తెలిపారు.

Gas Cylinder

వంట గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం చెప్పారు. సబ్సిడీ, జనరల్ కేటగిరీ వినియోగదారులు అందరికీ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపారు.

ఉజ్వల కింద అందించే 14.2 కిలోల ఎల్‌ల్పీజీ సిలిండ్‌ ధర 500 నుంచి రూ.550కి పెరిగింది. ఇతర వినియోగదారులకు గ్యాస్‌ సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కి పెరిగిందని వివరించారు.

Also Read: పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు.. మీరు ఎక్స్‌ట్రా కట్టక్కర్లే..

గత వారం కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.41 తగ్గించిన విషయం తెలిసిందే. వాణిజ్య సిలిండర్లను రెస్టారెంట్లు, హోటళ్లు ఇతర వాణిజ్య సంస్థలు వాడతాయి. ఇంట్లో వాడే సిలిండర్లను వంట గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ అంటారు. ఈ రోజే వీటి ధరలే పెరిగాయి.

మరోవైపు, కేంద్ర సర్కారు ఇవాళే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అయితే, ఈ పెరుగుదల ప్రభావం వినియోగదారులపై పడదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రమే ఈ పెరిగిన ధరలను భరిస్తాయి.