పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు.. మీరు ఎక్స్‌ట్రా కట్టక్కర్లే..

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 చొప్పున పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.

పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు.. మీరు ఎక్స్‌ట్రా కట్టక్కర్లే..

Updated On : April 7, 2025 / 4:24 PM IST

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 చొప్పున పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగవని స్పష్టం చేసింది. పెరిగిన ఎక్సైజ్‌ డ్యూటీని చమురు కంపెనీలే భరిస్తాయని తెలిపింది.

ఎక్సైజ్‌ డ్యూటీ పెంచడంతో దేశం అంతటా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని మొదట అందరూ భావించారు. అయితే, పెరిగిన ఈ ధరల భారాన్ని వాహనదారులకు బదలాయించే అవకాశం లేదని కేంద్ర సర్కారు స్పష్టం చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వస్తుందని చమురు మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. ప్రపంచ చమురు ధరలు అస్థిరతకు గురవుతున్న నేపథ్యంలో ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.13కి, డీజిల్‌పై రూ.10కి పెంచినట్లు ఉత్తర్వుల్లో కేంద్ర సర్కారు పేర్కొంది. ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 చొప్పున పెంచడంతో ఈ మేరకు ఆ సుంకాలు పెరిగాయి. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు ఇప్పటివరకు రూ.11, డీజిల్‌పై రూ.8గా ఉంది.

భారత్‌లో చివరిసారిగా పెట్రోల్ ధరలను గత లోక్‌సభ ఎన్నికల ముందు 2024, మార్చి 14న తగ్గించారు. ఆ మరుసటి రోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి.