టీవీల తయారీ వద్దునుకుంది, సర్జికల్ మాస్క్‌లను తయారుచేస్తోంది

ప్రముఖ టీవీ ఫ్యాక్టరీ Sharp టీవీలు తయారుచేయడం పక్కకుబెట్టి మాస్క్‌ల పని మొదలుపెట్టారు. ఒక్కరోజుకు జపాన్.. లక్షా యాబై వేల మాస్క్‌లు వాడుతుంది. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి మాస్క్‌లు ఓ మోస్తారుగా మాత్రమే సహాయం చేస్తాయి. అయినప్పటికీ వైరస్ అనేసరికి ముందుగా మాస్క్ లు వాడి ప్రమాదం నుంచి బయటపడాలని చూస్తున్నారు. (కరోనాను తరిమికొట్టిన కేరళ 5 వ్యుహాలు ఏంటో తెలుసా?)

ఎల్సీడీ ప్యానెళ్లు తయారుచేసి టెలివిజన్ బిజినెస్ చేసుకునే సంస్థ ఉన్నపాటుగా మాస్క్ లు తాయరుచేసి అంతే స్థాయిలో లాభాలు గడిస్తుందట. రోజుకు 5లక్షల ప్రొడక్షన్ చేస్తుంది. జపాన్ ప్రధానమంత్రి షింజో అబే నెలకు 6వేల లక్షల మాస్క్‌లు ఉత్పత్తి చేయాలని సూచించారట. మామూలు కంపెనీల మాదిరిగా కాకుండా అడ్వాన్స్‌డ్‌గా ప్లాన్ చేసింది షార్ప్ కంపెనీ. 

* వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. అయినా సరే మాస్క్‌లు ధరించడం మంచిది. 
* వైరస్‌కు యాంటీ బయోటిక్స్ లేవు. వైద్యులు చెప్పకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దు. 
* జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లునొప్పులు ఉంటే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 
* బయట తిరగి వచ్చిన తర్వాత..శుభ్రంగా కడుక్కోవాలి. 
* దగ్గు, తముళ్లు వచ్చే వాళ్ల నుంచి కనీసం 3 అడుగుల దూరంలో ఉండండి. 
* వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించాలి.