COVID-19 : విమానాశ్రయాలు వెలవెల..2 లక్షల విమానాలు రద్దు

  • Publish Date - March 6, 2020 / 03:18 AM IST

కరోనా వైరస్‌ విమానాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా ఎఫెక్ట్‌తో అత్యంత భారీగా నష్టపోయిన రంగం కూడా విమానాయరంగమే. ప్రపంచంలోని చాలా దేశాలు విదేశీయులు తమ దేశంలోకి రావడం పట్ల ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిణామాలతో ఆ రంగంలో 29 బిలియన్ల యూఎస్‌ డాలర్ల  నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈమేరకు అంతర్జాతీయ విమానయాన  భాగస్వామ్య సంస్థ తెలిపింది. గడిచిన దశాబ్దకాలంలో ఇదే భారీ నష్టంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల విమానాలు రద్దు చేసినట్టు కూడా ఆ సంస్థ ప్రకటించింది. ప్రధానంగా ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఒక్క చైనా విమానయానరంగానికే సుమారు 12.8 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. 

2003లో సార్స్‌ వైరస్‌వల్ల కూడా విమానాయాన రంగం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ కరోనాతో సేమ్‌ సిచ్యుయేషన్‌ రిపీట్‌ అవుతోంది.  న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌లో విమానసంస్థల షేర్ల విలువలు గణనీయంగా పడిపోతున్నాయి.  ఫిబ్రవరి చివరివారానికి వీటి సూచి సుమారు 20 శాతానికి పడిపోయింది. ఇంత పతనస్థాయి 2008 తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు విమాన ప్రయాణికులపై కరోనా ప్రభావం పడకుండా విమానయాన సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సంక్షోభం ముగిసేదాకా ఈ రంగానికి గడ్డకాలమే కొనసాగనుంది.

See Also | అక్కినేని అఖిల్‌కు షూటింగ్‌లో గాయాలు

ప్రపంచవ్యాప్తంగా 98 వేలమందికి పైగా వైరస్‌ సోకగా, 3,385 మంది మరణించారు. ఇప్పటి వరకు 89 దేశాలకు కోవిడ్‌-19 వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్‌ … ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. గురువారం చైనాలో 30మంది చనిపోగా… ఇటలీలో మాత్రం 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లోనూ 16మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. 

ఇటలీలో 790, దక్షిణకొరియాలో 670, ఇరాన్‌లో 6వందల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కోవిడ్‌ మృతుల సంఖ్య 11కు చేరడంతో కరోనాపై పోరాడేందుకు 8 బిలియన్‌ డాలర్లను వెచ్చించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ తీర్మానించింది.

See More :

*  కరోనా కట్టడి : ముఖాన్ని పదే పదే తాకొద్దు

మెట్రో రైలులో ఆన్ లైన్ టికెట్లు: కరోనా గురించి భయం వద్దు

కోవిడ్ బాధితుడు బస్సులో ప్రయాణించినప్పుడు జ్వరం లేదు