Card Tokenization: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ టోకెనైజేషన్ చేశారా? కార్డ్ టోకెనైజేషన్ అంటే ఏమిటి? ఆర్‌బీఐ ఏం చెబుతుంది..
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఆర్‌బీఐ ( రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 30లోగా డెబిట్, క్రెడిట్ కార్డుల టోకెనైజేషన్ కోసం గడువును పెంచింది. వీలైనంత త్వరగా కార్డ్ టోకెనైజేషన్ పూర్తి చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది.

debit and credits tokenization
Card Tokenization: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఆర్‌బీఐ ( రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 30లోగా డెబిట్, క్రెడిట్ కార్డుల టోకెనైజేషన్ కోసం గడువును పెంచింది. వీలైనంత త్వరగా కార్డ్ టోకెనైజేషన్ పూర్తి చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే అసలు కార్డ్ టోకెనైజేషన్ అంటే ఏమిటి? కార్డ్ టోకెనైజేషన్ ఎందుకు చేయాలి? దీనివల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాలను ఆర్‌బీఐ వివరించింది.
Tokenization : కార్డులు లేకుండానే..ఆన్ లైన్ షాపింగ్, ‘టోకనైజేషన్’ అంటే ఏమిటీ ? పూర్తి వివరాలు
కార్డ్ హోల్డర్లు మీ కార్డ్ టోకెనైజ్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డేటా సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు కార్డుతో పేమెంట్స్ చేస్తున్నట్లయితే మీ కార్డు వివరాలు సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కార్డ్ వివరాలు సేవ్ చేస్తే మీ కార్డ్ నెంబర్ ఆ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ డేటాబేస్ లో స్టోర్ అవుతోంది. అయితే కార్డ్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లో సేవ్ చేసుకోకూడదని ఆర్‌బీఐ తెలిపింది. ఇలా సేవ్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి మీ క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు వెళ్లే అవకాశం ఉంది. అయితే కార్డ్ టోకెనైజేషన్ చేయడం ద్వారా ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.

RBI Tokenization
మీరు మీ క్రెడిట్, డెబిట్ కార్డ్ టోకెనైజేషన్ చేయించుకున్నట్లయితే.. కార్డ్ ఆన్ ఫైల్ టోకెనైజేషన్ పద్దతి ద్వారా మీ కార్డ్ వివరాలకు ప్రత్యామ్నాయంగా టోకెన్ క్రియేట్ అవుతుంది. దీంతో మీ కార్డ్ నెంబర్ సదరు ప్లాట్ ఫామ్ డేటా బేస్‌లో సేవ్ కాదు. కేవలం టోకెన్ మాత్రమే క్రియేట్ అవుతుంది. మీరు టోకెన్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడు షాపింగ్ చేసినా సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. దీని వల్ల మీ కార్డు నెంబర్ కాకుండా టోకెన్ మాత్రమే సదరు సంస్థ దగ్గర ఉంటుంది. కాబట్టి మీ కార్డు వివరాలకు వచ్చిన ముప్పేమీ ఉండదు.
.@RBI Kehta Hai..
Want to generate a token for your debit/ credit card? Follow these 6 simple steps to tokenisation. It’s simple, it’s safe, it’s convenient.#BeAware #BeSecure#rbikehtahai #StaySafe #Tokenisationhttps://t.co/mKPAIpnAObhttps://t.co/RWS9vBbEZH pic.twitter.com/vTyBBeTCDH— RBI Says (@RBIsays) July 27, 2022
సెప్టెంబర్ 30లోపు డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను టోకెనైజేషన్ చేసుకొనే అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది. అయితే ఇప్పటికే టోకనైజేషన్ విధానం అమలు పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది. ఆర్‌బీఐ ఈ విధానాన్ని తొలిసారి 2020 మేలో ప్రతిపాదించింది. తొలుత 2021 జూన్ 30వ తేదీని గడువుగా నిర్ణయించారు. మళ్లీ ఆ గడువు తేదీని 2021 డిసెంబర్ 31కి మార్చారు. అప్పటికీ మరోసారి గడువు పొడిగించాలని వినతులు రావడంతో మరో ఆరు నెలలు గడువు పెంచారు. ఆ తరువాత మళ్లీ సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయించింది. టోకనైజేషన్ సిస్టమ్ పూర్తిగా ఉచితం. అయితే దేశీయ ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే టోకనైజేషన్ వర్తిస్తుంది. కొత్త విధానం సురక్షితమైనదని రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్నప్పటికీ, టోకనైజేషన్ కార్డు హోల్డర్లకు పూర్తి భద్రత ఇస్తుందని చెప్పలేమని, కానీ, డేటా ఉల్లంఘనను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.