Credit Card : క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ నుంచి మరిన్ని రూల్స్.. ఈ జాగ్రత్తలు పాటించండి
Credit Card : ఏప్రిల్ నెల నుంచి క్రెడిట్ కార్డును ఎడాపెడా వాడకపోవడం బెటర్. ఎందుకంటే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
Credit Card
- క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్
- ఏప్రిల్ 1నుంచి పాన్‌తో క్రెడిట్ కార్డు లింక్ తప్పనిసరి
- పెద్ద ట్రాన్సాక్షన్లపై పెరగనున్న నిఘా
- ఆఫీస్ కార్డుతో చేసే పర్సనల్ ఖర్చులు ట్యాక్స్ పరిధిలోకి
Credit Card : క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆన్లైన్ షాపింగ్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న స్థాయి ఉద్యోగి నుంచి పెద్ద స్థాయి ఉద్యోగి వరకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. కొందరు ప్రతి వస్తువు కొనుగోలుకు క్రెడిట్ కార్డును వాడుతుంటారు. అయితే, ఇకనుంచి క్రెడిట్ కార్డు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మరికొన్ని రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ నెల నుంచి క్రెడిట్ కార్డును ఎడాపెడా వాడకపోవడం బెటర్.
ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుతో క్రెడిట్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. దీంతో యూజర్ జరిపే ప్రతీ ట్రాన్సాక్షన్ వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ (ఐటీడీ)కి వెళుతాయి. ముఖ్యంగా పెద్ద ట్రాన్సాక్షన్లపై అధికారులు ఓ కన్నేసి ఉంచుతారు. ప్రస్తుతం బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు అనుమానాస్పద, రూ.10లక్షలకు మించిన క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ వివరాలను ఐటీడీకి పంపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ నెల నుంచి అన్ని ట్రాన్సాక్షన్లు ఐటీ రేడార్లో ఉంటాయి. ఫైనాన్షియల్ సంస్థలు పాన్ లేకుండా కొత్త కార్డులను ఇవ్వడానికి కుదరదు. అంతేకాదు.. ఆఫీస్ క్రెడిట్ కార్డుతో పర్సనల్ ఖర్చులు చేస్తే అవి పన్ను పరిధిలోకి వస్తాయి.
కొత్త రూల్స్..
♦ క్రెడిట్ కార్డు, పాన్ లింక్, ఫారం-16, ట్యాక్స్ ఇయర్ మార్పు వంటి కొత్త ఐటీ నియమాలు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి.
♦ ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డు తీసుకోవడానికి పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డు తీసుకోవడానికి ఆధార్‌తోపాటు డేట్ ఆఫ్ బర్త్ (డీఓబీ) ఫ్రూప్ తప్పనిసరి. పాత పాన్ కార్డు అప్లికేషన్లు చెలవు.
♦ రూ.10లక్షలు పైబడిన ఖర్చులపై నిఘా మరింత పెరగనుంది.
♦ ఉద్యోగులకు యాజమాని ఇచ్చే ఫారం-16లో ట్యాక్స్డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వివరాలు ఉండేవి. పార్ట్ ఏ, పార్ట్ బీ కింద రెండు ఫార్మాట్లలో వివరాలు ఉండేవి. అయితే, కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి ఫారం -16 బదులు కొత్త ఫారం 130ని యాజమానులు ఇస్తారు. ఇది ఒకే ఫార్మాట్లో ఉంటుంది. ఉద్యోగి జీతం, ఇతర ఆధాయాలు, టీడీఎస్, ఇన్వెస్ట్మెంట్ డిడక్షన్లు, ట్యాక్స్ బకాయిలు వంటి వివరాలన్నీ ఒకే ఫారంలో ఉంటాయి.
♦ ఫైనాన్సియల్ ఇయర్ (ఎఫ్వై), అసెస్మెంట్ ఇయర్ (ఏవై) అనే పదాలు ఇకనుంచి ఉండవు ట్యాక్స్ ఫైలింగ్ ను సులభం చేయడానికి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించనుంది.
♦ 2025-2026 ఆర్థిక సంవత్సరం కోసం వచ్చే జులైలోపు ఐటీఆర్ ఫైలింగ్ ఉంటుంది.
♦ ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించుకోవచ్చు. కానీ, బిల్లు సకాలంలో చెల్లించకపోతే భారీ వడ్డీ, ఫెనాల్టీలు పడతాయి.
ఈ జాగ్రత్తలు పాటించండి..
♦ క్రెడిట్ కార్డు వినియోగదారులు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
♦ క్రెడిట్ కార్డులను పాన్ తో లింక్ చేయండి.
♦ ఏడాది పొడవునా జరిపే పెద్ద ఖర్చులను జాగ్రత్తగా గమనించండి.
♦ మీ ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు లేకపోతే పన్నుశాఖ నుంచి నోటీసులు వస్తాయి.
♦ ఆఫీసు కార్డును కేవలం అధికారిక పనులకు మాత్రమే వాడాలి. గ్రాసరీ, పర్సనల్ గ్యాడ్జెట్లు, షాపింగ్ కు వాడొద్దు.
♦ ఈ కొత్త నియామకాలతో ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణ మరింత మెరగవుతుంది.
