YesBank కస్టమర్స్ NEFT, IMPS ద్వారా డబ్బు చెల్లింపులు చేసుకోవచ్చు

ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వినియోగదారులు తన తక్షణ డబ్బు బదిలీ సేవలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా కొన్ని చెల్లింపులు చేయవచ్చని యెస్ బ్యాంక్ యాజమాన్యం చెప్పింది.

  • Publish Date - March 10, 2020 / 06:34 AM IST

ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వినియోగదారులు తన తక్షణ డబ్బు బదిలీ సేవలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా కొన్ని చెల్లింపులు చేయవచ్చని యెస్ బ్యాంక్ యాజమాన్యం చెప్పింది.

ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వినియోగదారులు తన తక్షణ డబ్బు బదిలీ సేవలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా కొన్ని చెల్లింపులు చేయవచ్చని యెస్ బ్యాంక్ యాజమాన్యం చెప్పింది. యెస్ బ్యాంక్ కస్టమర్స్ IMPS, NEFT ఉపయోగించి వారి క్రెడిట్ కార్డ్ బకాయిలు, రుణాలు ఇతర బ్యాంక్ ఖాతాల నుండి చెల్లించవచ్చని ఉదయం ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) యెస్ బ్యాంక్ బోర్డును అధిగమించి, గత వారం ప్రైవేటు రంగ రుణదాతపై నియంత్రణ సాధించింది. కొన్ని మినహాయింపులతో తన ఖాతాల నుండి ఉపసంహరణలను పరిమితం చేసింది. పెట్టుబడిదారులను భయపెట్టింది.(YES బ్యాంక్ లో చిక్కుకున్న APSRTC రూ. 240  కోట్లు)

యెస్ బ్యాంక్ ను ప్రణాళికాబద్ధకంగా రక్షించడానికి నాయకత్వం వహించడానికి ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రోత్సహించింది. ప్రస్తుతం ఆర్బిఐ.. యెస్ బ్యాంక్ ఉపసంహరణలను ఏప్రిల్ 3 వరకు రూ .50 వేలకు పరిమితం చేసింది. డిపాజిటర్లను రక్షించడానికి ఉపసంహరణపై పరిమితులు విధించింది.

ఎస్బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ యెస్ బ్యాంక్ ఖాతాల నుండి ఉపసంహరణపై ప్రస్తుత పరిమితిని వారంలోపు ఎత్తివేయవచ్చన్నారు. యెస్ బ్యాంక్ కస్టమర్స్ డబ్బు గురించి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని ఆయన అన్నారు.

సమస్యాత్మక ప్రైవేటు రంగ రుణదాత కోసం రెస్క్యూ ఒప్పందంలో భాగంగా యెస్ బ్యాంక్లో 49 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఎస్బిఐ వెంటనే రూ.2,450 కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. పెరుగుతున్న అప్పుల భారంతో యెస్ బ్యాంక్ సతమవుతోంది. అవసరమైన మూలధనాన్ని పెంచడానికి నెలల తరబడి కష్టపడింది.

See Also | మధ్యప్రదేశ్‌లో కుప్పకూలనున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అమిత్ షాతో కలసి మోడీతో సింధియా మంతనాలు​​​​​​​

ట్రెండింగ్ వార్తలు