బంగారం పండుగ వచ్చేసింది. ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం కొనే ప్లాన్‌లో ఉంటే..అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. బంగారం, డైమండ్ వ్యాపారం చేసే సంస్థలు..భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు..ప్రకటిస్తున్నారు. కంపెనీలు, వాణిజ్య సంస్థల్లో బోనస్‌లు ఇస్తుంటారు. కనుక, పసిడి కొనుగోళ్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంగారం కొనుగోలు చేస్తే..లాభ పడుతామని అనే భావనలో ఉంటారు.
పసిడి ఆభరణాలు కొనుగోలు చేస్తే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తామని ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి పలు బంగారం వ్యాపారులు. పాత బంగారం తెస్తే..కొత్త బంగారం ఇస్తామని పలు కంపెనీలు ప్రకటిస్తున్నాయి. పేటీఎం వంటి యాప్‌లతో చెల్లిస్తే..నగదు వెనక్కి సదుపాయాలుంటే.. ఉపయోగించుకోవచ్చని వెల్లడిస్తున్నారు. రూ. 15 వేలు విలువైన బంగారం కొనుగోలు చేస్తే..ఒక బంగారం నాణెం ఇస్తామంటోంది బంగారం, డైమండ్స్ వ్యాపారం చేసే సంస్థలు. అంతేగాకుండా..పలు బ్యాంకులు కూడా భారీ ఆఫర్స్ ప్రకటించాయి.
అంతే విలువైన డైమండ్ జువెలరీ కొనుక్కుంటే..2 బంగారం నాణెలను ఫ్రీగా ఇస్తామని వెల్లడిస్తోంది. అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఇక బ్యాంకు కస్టమర్లకు కూడా పలు ఆఫర్స్ ప్రకటించింది. క్యాష్ బ్యాక్ ప్రయోజనం కూడా పొందవచ్చంటోంది. టాప్ జువలెరీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారు.
Read More : బంగారం పండుగ వచ్చింది : పాత బంగారం తెస్తే కొత్త ఆభరణాలు