Digital Gold Savings App Jar : డిజిటల్‌ గోల్డ్‌ సేవింగ్స్‌ యాప్‌ ‘జార్‌’.. 20 మిలియన్ల మార్క్ దాటేసింది!

Digital Gold Savings App : డిజిటల్ గోల్డ్ స్పేస్‌లో మార్కెట్ లీడర్‌గా జార్ స్థానాన్ని పటిష్టం చేస్తోంది. రోజుకు ఒక మిలియన్‌కుపైగా ట్రాన్సాక్షన్లతో ప్రస్తుత డిజిటల్‌ గోల్డ్‌ స్పేస్‌లో జార్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Digital Gold Savings App Jar : సేవింగ్స్‌ విషయంలో ‘జార్‌’ ఆచరిస్తున్న వినూత్న విధానాలు, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో, సులువైన కస్టమర్‌ చర్యలు, సరికొత్త డిజైన్‌తో ఏకంగా ఇరవై (20) మిలియన్ల మార్క్‌ను అందుకుంది. సగటు జార్‌ యూజర్‌ నెలకు 22 సార్లు ఈ జార్ యాప్‌ను వినియోగిస్తున్నాడు. డిజిటల్ గోల్డ్ స్పేస్‌లో మార్కెట్ లీడర్‌గా జార్ స్థానాన్ని పటిష్టం చేస్తోంది. రోజుకు ఒక మిలియన్‌కుపైగా ట్రాన్సాక్షన్లతో ప్రస్తుత డిజిటల్‌ గోల్డ్‌ స్పేస్‌లో జార్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Read Also : OnePlus 12 Discount Offers : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్లు ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

జార్‌లో కేవలం 45 సెకన్ల వ్యవధిలో కస్టమర్‌ కనీసంగా రూ. 10తో సేవింగ్స్‌ మొదలుపెట్టే అవకాశం కల్పించింది. 24కే క్యారట్‌ బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు కస్టమర్లు అవకాశముంది. డిజిటల్‌ గోల్డ్‌ స్వచ్చమైన బంగారాన్ని సూచిస్తుంది. జార్‌ యూజర్లు ఎంతైనా బంగారాన్ని దాచుకునే అవకాశం ఉంది.

బంగారంగా దాచుకుని తిరిగి డబ్బుల రూపంలో :
అంతేకాదు.. దాచుకున్న బంగారాన్ని తిరిగి తీసుకునే అవకాశంతో పాటు డబ్బులుగా మార్చుకునేందుకు తమ యూజర్లకు జార్‌ యాప్‌ కల్పిస్తోంది. జార్‌ అవలంభిస్తున్న వినూత్న విధానాలతో సగటు కస్టమర్‌ తమ తాకట్టు పెట్టిన దానిపై డిజిటల్‌ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టేందుకు మెరుగైన అవకాశాలు అందిస్తోంది.

జార్‌ను 2021లో నిశ్చయ్‌, మిశబ్‌ అష్రఫ్‌ స్థాపించారు. భారత్‌లో సగటు మధ్య తరగతి ప్రజలు రోజువారీగా ఎలాంటి సేవింగ్స్‌ చేస్తున్నారే దానిపై దృష్టిసారిస్తోంది. కానీ, దేశంలో సరైన పెట్టుబడి విధానం లేదన్న విషయాన్ని గ్రహిస్తూ మిలియన్ల మందికి ఏదో ఒకటి చేయాలని జార్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ఈ యాప్‌ దోహదపడుతుందని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్టు కంపెనీ పేర్కొంది.

ఇప్పటికే డిజిటల్‌ గోల్డ్‌పై తమదైన ముద్ర వేసిన జార్‌ యాప్‌.. మార్కెట్‌ను మరింత విస్తృతం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా లెడింగ్‌, ఇన్వెస్టమెంట్‌లపై దృష్టిపెడుతూ కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. లింక్‌డిన్‌ 2023 ప్రకటించిన టాప్‌ స్టారప్‌లలో జార్‌ యాప్‌ ఒకటిగా నిలిచింది.

Read Also : Honor Pad 9 First Sale : హానర్ ప్యాడ్ 9 ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్లు, స్పెషిఫికేషన్‌లు ఇవే!

ట్రెండింగ్ వార్తలు